బీజేపీ వెనుకడుగు: 24గం.ల్లో.. జైట్లీకి చంద్రబాబు అల్టిమేటం

Posted By:
Subscribe to Oneindia Telugu

ఢిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం నాడు ఫోన్ చేశారు. ఆయనతో దాదాపు అరగంట పాటు మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు హోదా, ప్యాకేజీ పైన అల్టిమేటం జారీ చేశారని తెలుస్తోంది.

ఏపీకి ప్రత్యేక హోదా అంశం పార్లమెంటును కుదిపేస్తున్న విషయం తెలిసిందే. స్వయంగా చంద్రబాబు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ కొంత తగ్గి, తెలుగుదేశం పార్టీతో చర్చలకు మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే.

Chandrababu ultimatum to Arun Jaitley?

ఇందులో భాగంగా జైట్లీ ఈ రోజు చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ గురించి చంద్రబాబు పట్టుబట్టారని సమాచారం. దానిపై సాధ్యమైనంత త్వరగా ప్రకటన చేసి, ఆచరణలోకి తేవాలని కూడా విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదాపై 24 గంటల్లో స్పష్టత రాకుంటే ఆందోళన తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు.. జైట్లీకి తేల్చి చెప్పారని తెలుస్తోంది.

సోమవారం వేర్వేరుగా చర్చలు

ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రత్యేక కేటగిరి హోదా, ప్రత్యేక ప్యాకేజిలపై ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు సోమవారం వేర్వేరుగా మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పదిహేను నిమిషాల పాటు చర్చించారు.

ఏపీ ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపించాలని విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాలతో సమానస్థాయికి ఏపీని తీసుకురావాలంటే ఈ సమస్యల్ని పరిష్కరించాల్సి ఉందన్నారు. విభజన చట్టం అమలు తీరు, చట్టంలో లేకపోయినా వివిధ ప్రాజెక్టుల్ని/ సంస్థల్ని మంజూరు చేయడం గురించి ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది.

ఏపీ సమస్యలకు పరిష్కారం చూపడంపై ప్రధాని అత్యంత సానుకూలంగా స్పందించారనీ, దీనికి సంబంధించిన ప్యాకేజీపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు నీతి ఆయోగ్‌ ఏ సిఫార్సులు చేసిందో అడిగారనీ తెలుస్తోంది.

ఏపీ ప్రజల బాధ అర్థమైంది, బాబుతో మాట్లాడా: జైట్లీ, అసలేం మాట్లాడారు!

మరోవైపు, జైట్లీతో సుజనాచౌదరి కూడా సోమవారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్ని, పరిష్కార మార్గాలను చర్చించారు.

ఆ తర్వాత వెంకయ్య, జైట్లీ, సుజనా చౌదరి మరో దఫా చర్చలు జరిపారు. వెంకయ్య, జైట్లీ, బీజేపీ అధ్యక్షులు అమిత్ షా త్వరలోనే సమావేశమై, ఏపీ ప్యాకేజిపై నీతి ఆయోగ్‌ నివేదికను చర్చించనున్నారు. అనంతరం వారు చంద్రబాబుతోనూ చర్చించి, చివరగా ప్రధాని మోడీ వద్దకు ఏపీ అంశాన్ని తీసుకెళ్తారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP CM Chandrababu ultimatum to Union Minister Arun Jaitley?

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి