వైఎస్ లేఖనే శాపం: కృష్ణానీటి పంపకంపై బాబు
హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగులు జలాలు తమకు అక్కర్లేదని వైయస్ రాజశేఖర రెడ్డి 2006 మార్చి 2వ తేదీన రాసిన లేఖనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాపంగా మారిందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో నిందించారు. బ్రిటిష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కర్ణాటకకు అుకూలంగా వ్యవహరించిందని ఆయన తప్పు పట్టారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచకుండా తమ ప్రభుత్వ హయాంలో అడ్డుకున్నామని, ఆల్మట్టి ఎత్తు పెంపును ట్రిబ్యునల్ అంగీకరించడం దారుణమని ఆయన అన్నారు. 65 శాతం జలాలను మాత్రమే నీటి పంపకానికి పరిగణనలోకి తీసుకోవడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు.

బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల మిగులు జలాలపై ఆధారపడి రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులు నిర్వీర్యం అవుతాయని ఆయన అన్నారు. మనవాళ్లు ట్రిబ్యునల్ ముందు సరిగా వాదనలు వినిపించలేకపోయారని ఆయన విమర్శించారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అక్రమంగా పలు ప్రాజెక్టులు కట్టాయని ఆయన అన్నారు. ప్రస్తుత తీర్పు వల్ల రాష్ట్రానికి 337 టిఎంసిల కృష్ణా జలాలు మాత్రమే వస్తాయని, 600 టిఎంసిల నీటి లోటు ఏర్పడుతుందని చంద్రబాబు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎత్తి చూపిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో 32 వేల కోట్ల జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులు పనికి రాకుండా పోతాయని ఆయన అన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల మన రాష్ట్రానికి ఆలస్యంగా నీరు వస్తుందని, దాని వల్ల పంటలు ఆలస్యంగా వేసుకోవాల్సి వస్తుందని, అక్టోబర్ నవంబర్ నెలల్లో వచ్చే తుఫాన్ల వల్ల నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేశారని, ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్‌కు హక్కు ఉంటుందని తాము వాదించామని ఆయన చెప్పారు.
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications