వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం ఎఫెక్ట్: జవాబు చెప్పుకోవాలి.. మోడీ దుమ్ముదులిపిన బాబు, ఆధారాలతో సహా లెక్కలు!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Polavaram Project Pending : Chandrababu Angry on Modi | Oneindia Telugu

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారని గురువారం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వెల్లడించారు. 9, 10వ షెడ్యూల్ విభజన ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. హోదాకు బదులు ఆ స్థాయిలో అన్నీ ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని చెప్పారు. హామీలపై ప్రజలకు సమాధానం చెప్పుకోవాలన్నారు.

చంద్రబాబుకు భారీ షాక్: పోలవరం పనులకు కేంద్రం కొర్రీలు చంద్రబాబుకు భారీ షాక్: పోలవరం పనులకు కేంద్రం కొర్రీలు

తాము రాష్ట్రం కోసం రాజకీయాలు ఆలోచించలేదని, ప్యాకేజీతో ఏపీకి లాభమని సరేనని చెప్పామన్నారు. అలాగే, రాష్ట్రానికి కూడా తక్షణ అవసరం కాబట్టి ప్యాకేజీకి అంగీకరించామని చెప్పారు. కేంద్రం తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం పనులు ఆపాలని కేంద్రం లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై చంద్రబాబు స్పందించారు.

పాదయాత్రలో షాకింగ్, నిజమా: 'జగన్ చెప్పిందేమిటి, చేస్తుందేమిటీ!?'పాదయాత్రలో షాకింగ్, నిజమా: 'జగన్ చెప్పిందేమిటి, చేస్తుందేమిటీ!?'

ఏపీకి సాయం చేయాల్సిన కేంద్రం ఇలా చేస్తే ఎలా

ఏపీకి సాయం చేయాల్సిన కేంద్రం ఇలా చేస్తే ఎలా

రెవెన్యూ లోటుతో విడిపోయిన నవ్యాంధ్రకు సాయం చేయాల్సిన కేంద్రం ఇలా చేస్తే ఎలా అని చంద్రబాబు నిలదీశారు. పోలవరంపై తాజా నిర్ణయంతో గందరగోళం ఏర్పడిందన్నారు. పోలవరం కోసం ఇంకా 60 వేల ఎకరాలు సేకరించాల్సి ఉందని చెప్పారు. 98వేల గిరిజన కుటుంబాలు ఉన్నాయన్నారు. మూడు రోజుల్లో పదవి విరణ చేసే అధికారితో లేఖ రాయించారన్నారు.

బీజేపీ నేతలు ఒత్తిడి తేవాలి, 62 సార్లు ఢిల్లీకి

బీజేపీ నేతలు ఒత్తిడి తేవాలి, 62 సార్లు ఢిల్లీకి

ఏపీకి ఇచ్చిన హామీలను అమలుపర్చేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని బీజేపీ నేతలకు చంద్రబాబు సూచించారు. విభజన హామీల అమలు పైన 62సార్లు తాము ఢిల్లీకి వెళ్లామని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే అనేక పోలవరంపై కేసులు వేశారని చెప్పారు.

కేంద్రం అధికారుల తీరు కూడా

కేంద్రం అధికారుల తీరు కూడా

పోలవరం పూర్తి కావాలంటే కొన్ని పనులు వేరేవాళ్లకు ఇవ్వాలని నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు. కొందరు పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించాలని చూస్తున్నారన్నారు. కేంద్రంలోని కొందరు అధికారులు కూడా అదే తీరుతో ఉన్నారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఇంకా 60వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందన్నారు.

వైసీపీ రాజీనామా చేస్తామని తగ్గింది

వైసీపీ రాజీనామా చేస్తామని తగ్గింది

పోలవరం ప్రాజెక్టు విషయమై ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తనను విమర్శిస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. విభజన సమయంలో సరిగా వ్యవహరిస్తే ఇలా జరిగి ఉండేది కాదన్నారు. ఆ తర్వాత వైసీపీ ఎంపీలు హోదా కోసం రాజీనామా చేస్తామని చెప్పి వెనక్కి తగ్గారని దుయ్యబట్టారు. కేవీపీ రామచంద్ర రావు ఢిల్లీలో విమర్శలు చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్ వల్లే పోలవరం ప్రాజెక్టు వ్యయం పెరిగింది

కాంగ్రెస్ వల్లే పోలవరం ప్రాజెక్టు వ్యయం పెరిగింది

తప్పు వారు చేసి, ఇప్పుడు తనను విమర్శిస్తారా అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు వ్యయం పెరగడానికి కాంగ్రెస్ పార్టీయే కారణం అన్నారు. కొత్త భూసేకరణ చట్టం తెచ్చింది వారేనని, అందుకే పోలవరం ప్రాజెక్టు వ్యయం పెరిగిందని తెలిపారు. సకాలంలో పోలవరం పూర్తి చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.

అందుకే చంద్రబాబు వద్దకు అని బీజేపీ నేతలు

అందుకే చంద్రబాబు వద్దకు అని బీజేపీ నేతలు

అంతకుముందు, బీజేపీ నేతలు సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా విష్ణు కుమార్ రాజు మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. చంద్రబాబు అపాయింటుమెంట్ ఇవ్వడంతో కలిశామని, రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు.

ఇప్పుడు వచ్చిన లేఖతో గందరగోళం

ఇప్పుడు వచ్చిన లేఖతో గందరగోళం

బీజేపీ నేతలు కలిసిన సమయంలో చంద్రబాబు తీవ్ర అసహనం, ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి వచ్చిన లేఖను వారికి చూపించారు. ఇప్పుడు వచ్చిన లేఖతో గందరగోళం ఏర్పడిందన్నారు. పోలవరానికి అన్ని ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయన్నారు. ఓ వైపు ప్రతిపక్షం అడ్డుకుంటుంటే, మరోవైపు కేంద్రం సాయచం లేదని చెప్పారు.

హోదాపై మోడీయే చెప్పారు

హోదాపై మోడీయే చెప్పారు

రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని, కేంద్రంపై మీరు ఒత్తిడి తేవాలన్నారు. ప్యాకేజీ, ఆర్థిక లోటు ఏదీ భర్తీ కావడం లేదని చెప్పారు. అరకొర సాయం చేస్తున్నారని చెప్పారు. హోదా ఇస్తామని నాడు మోడీయే చెప్పారని గుర్తు చేశారు. ఆర్థిక లోటుతో పడిపోయిన ఏపీకి చేయూత నివ్వాల్సిన కేంద్రం ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు.

ఇదిగో లెక్క.. ఆధారాలు చూపిన బాబు

ఇదిగో లెక్క.. ఆధారాలు చూపిన బాబు

ఈ సందర్భంగా చంద్రబాబు ఆధారాలతో సహా బీజేపీ నేతలకు సూచించారు. ఏపీలో రూ.17వేల కోట్ల రెవెన్యూ లోటు ఉందని, గవర్నర్ నివేదిక పంపినా రూ.7వేల కోట్లు మాత్రమే అంటున్నారని, ఇచ్చింది మాత్రం రూ.4500 కోట్లు అని వాపోయారు. ఈ పరిణామాలు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తున్నాయని చెప్పారు. 13 విద్యా సంస్థల ఏర్పాటుకు అరకొర నిధులు ఇచ్చారన్నారు. రూ.475 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. ఐఐటీ కోసం రూ.3వేల కోట్లు అడిగితే రూ.18వేలు ఇచ్చారన్నారు. దుగరాజుపట్నం సాధ్యం కాదని నీతి అయోగ్ చెప్పిందని చంద్రబాబు అన్నారు. సెంట్రల్ వర్సిటీ, గిరిజన వర్సిటీలు రావాలని చెప్పారు. ఎయిమ్స్ వంటి పలు సంస్థలకు తాము భూములు సమకూర్చామని చెప్పారు.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Unhappy with Central Government over polavaram project pending letter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X