మీ పని తీరుతో విసుగొస్తుంది, మన పిల్లలు కార్పోరేట్ స్కూల్లో: బాబు అసహనం
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కోపం వచ్చింది. విద్యా శాఖ అధికారుల పైన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించడంలో విద్యాశాఖ సరిగ్గా పని చేయడం లేదని ఆయన ఆగ్రహించారు.
మన పిల్లల్ని కార్పొరేట్ పాఠశాలల్లో చదివిస్తామని, కానీ పేదల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారని, ఏటా రూ.22వేల కోట్ల బడ్జెట్ ఇస్తున్నామని, అడిగినవి సమకూరుస్తున్నామని, అయిప్పటికీ ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉండటం సరికాదన్నారు.

అన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్ పద్ధతిని పెట్టాలని రెండేళ్ల నుంచి చెబుతున్నా అమలుపరచకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. చరిత్ర చెప్పడం కాదని, ఏం సాధించారో చెప్పాలని అధికారులను నిలదీశారని తెలుస్తోంది. విద్యా శాఖ తీరుతో విసుగొస్తుందన్నారు.
చంద్రబాబు గురువారం జరిగిన కలెక్టర్ల సదస్సులో మాట్లాడారు. శ్రీకాళహస్తి-ఏర్పేడు, కృష్ణపట్నం, విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లతో పాటు మరో కొత్త కారిడార్ ఏర్పాటుకు కలెక్టర్లు తక్షణమే భూసమీకరణ చేయాలన్నారు. నూజివీడు, మచిలీపట్నం, ద్వారకా తిరుమలల్లో రెండుచోట్ల ఎక్కడ తొందరగా భూమి అందుబాటులోకి వస్తే అక్కడ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications