హరికృష్ణకు ధైర్యం చెప్పిన బాబు, ఇంటికెళ్లి గంట ఉన్నారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాజ్యసభ మాజీ సభ్యుడు, ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ ఇంటికి వెళ్లి ఓదార్చారు. హరి నివాసంలో చంద్రబాబు దాదాపు గంట సేపు గడిపారు. జానకిరామ్ మృతి నేపథ్యంలో హరికి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. హరి, కల్యాణ్ రామ్ తదితరులు ఇంట్లో ఉన్నారు.
కాగా, గత ఆదివారం హరికృష్ణ తనయుడు నందమూరి జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. జానకిరామ్ స్వయంగా నడుపుతున్న కారు ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం కోనాయిగూడెం గ్రామానికి చెందిన యలమంచి వెంకన్న అనే రైతు ట్రాక్టర్ ఢీకొట్టింది.
అనంతరం జానకిరాం అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం ముగిశాయి. మొయినాబాద్‌లోని ముర్తూజగూడలోని ఫాం హౌస్‌లో అంత్యక్రియలు పూర్తయ్యాయి. జానకిరాం కొడుకు తారక రామారావు చితికి నిప్పంటించారు. నందమూరి కుటుంబంతో పాటు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు.

సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. చంద్రబాబు, వైయస్ జగన్, లక్ష్మీపార్వతి, చిరంజీవి, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, ఎల్ రమణ్ తదితరులు హాజరయ్యారు. వీరితో నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు హాజరయ్యారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశంలో ఉన్నందున ఆయన అంత్యక్రియలకు హాజరుకాలేదు. అంతకుముందే ఆయన నివాళులు అర్పించారు. జానకీరం మృతితో చిరంజీవి, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ సహా అందరూ చలించిపోయారు.
చిరు కళ్లలో కన్నీరు కనిపించింది. అంతేకాదు, ఆయన సీటు బెల్టు పెట్టుకోవాలి సూచించారు. అంత్యక్రియల సందర్భంగా జూ.ఎన్టీఆర్ ఊబికి వస్తున్న కన్నీటిని ఆపుకునే ప్రయత్నం చేశారు. జానకిరాం తనయుడు తారక రామారావు చితికి నిప్పు అంటించేందుకు జూనియర్ ఎన్టీఆర్ సాయపడ్డారు. ఆ తర్వాత బాలుడిని పక్కకు తీసుకు వచ్చారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications