వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్బర్Vsబాబు: దేశంలో గోద్రా ఒక్కటే జరిగిందా.. రేవంత్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu VS Akbaruddin in Assembly
హైదరాబాద్: అసెంబ్లీ ముసాయిదా బిల్లుపై శాసన సభలో చర్చ జరుగుతున్న సమయంలో తెలుగుదేశం, మజ్లిస్ పార్టీల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. హైదరాబాదు నగరాన్ని తాము సింగపూర్‌లా చేశామని, నాలుగు వందల ఏళ్లలో నిజాం రాజు సికింద్రాబాదును మాత్రమే అభివృద్ధి చేశారని, తాము తొమ్మిదేళ్లలో హైదరాబాదు మొత్తాన్ని అభివృద్ధి చేశామన్నారు.

హైదరాబాదు అభివృద్ధి టిడిపి ఘనతే అన్నారు. నిజాం చేయని అభివృద్ధి తాము చేశామన్నారు. ఒకప్పుడు హైదరాబాదులో మత కల్లోహాలు ఉండేవని, కర్ఫ్యూలు ఉండేవన్నారు. శాంతిభద్రతలను హైదరాబాదులో తామే పునరుద్దరించామని చెప్పారు.

పాలకుల నిర్లక్ష్యం: అక్బర్

పాలకుల నిర్లక్ష్యం వల్లనే రాయలసీమ వెనుకబడిందని మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్లే రాష్ట్రాన్ని చాలా ఏళ్లు పాలించారని, ఎందుకు అభివృద్ధి చేసుకోలేదని ప్రశ్నించారు. హైదరాబాదు అభివృద్ధి చెందిన నగరం కాబట్టి సీమాంధ్రులు ఇక్కడకు వచ్చారన్నారు.

ఓ సమయంలో బిజెపి, టిడిపి పార్టీల స్నేహాన్ని అక్బరుద్దీన్ ప్రస్తావించారు. దానిపై ఆ రెండు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. గోద్రా అల్లర్లకు కారణమైన బిజెపి, నరేంద్ర మోడీతో చంద్రబాబు కలిశారని అన్నారు.

రేవంత్ రెడ్డి ఆగ్రహం

అక్బరుద్దీన్ పైన టిడిపి నేత రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిల్లులపై పార్టీలు అభ్యంతరం చెప్పుకోవడానికి అభ్యంతరం లేదని కానీ, చంద్రబాబు పైన విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. అక్బరుద్దీన్ తీరు చూస్తుంటే ఈ దేశంలో గోద్రా అల్లర్లు ఒక్కటే జరిగినట్లుగా చెబుతున్నారన్నారు. గోద్రా ఘటనను తమ పార్టీ ఖండించిందన్నారు.

గోద్రా ఒక్కటే దేశంలో జరగలేదన్నారు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వందలాది మంది చనిపోయారన్నారు. మతకల్లోహాలకు కారణమైన వైయస్‌తో జత కట్టింది మజ్లిస్ పార్టీయే అన్నారు. దేశంలో ఏర్పడిన కాంగ్రెస్సేతర ప్రభుత్వాలు టిడిపి మద్దతుతోనే వచ్చాయన్నారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా చేసేందుకు మజ్లిస్ ముందుకు రాలేదన్నారు.

English summary
MIMLP Akbaruddin Owaisi and Telugudesam party chief Nara Chandrababu Naidu argued over Hyderabad Development in Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X