ఇద్దరూ నియంతలే- వీళ్లకు ఓటేయకండి- జనసేన నేత షాకింగ్ పిలుపు..!

రాష్ట్ర ప్రజలందరూ జగన్, చంద్రబాబు ప్రెస్ మీట్లు గమనిస్తున్నారని, ప్రజాస్వామ్యం మీద వీళ్లిద్దరికీ ఎంత భక్తి ఉందో చాలా చిత్తశుద్దిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ (Bolisetty Satyanarayana) తెలిపారు. గతంలో 2020-21లో దొరికిన వాళ్లను దొరికినట్లు తన్ని, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసి, ఎన్నికల కమిషనర్ ను భయపెట్టి, చివరికి ఆడవాళ్లు జాకెట్లలో పెట్టుకున్న నామినేషన్ పత్రాలు కూడా లాక్కుని బలవంతాన ఎన్నికలు ఏకగ్రీవం చేసుకున్నారని బొలిశెట్టి సత్యనారాయణ తెలిపారు.

జగన్ - షర్మిల వివాదంపై స్పందించిన చంద్రబాబు- కీలక వ్యాఖ్యలు..!
జగన్ - షర్మిల వివాదంపై స్పందించిన చంద్రబాబు- కీలక వ్యాఖ్యలు..!

జగన్ అధికారంలో ఉన్నప్పుడు అలా చేసుకున్నాడు కాబట్టి, నేను కూడా చేసుకోవాలని చంద్రబాబు భావిస్తూ అదే పంథా మొదలుపెట్టారని బొలిశెట్టి తెలిపారు. వైసీపీ వాళ్లతో మొదలుపెట్టి టీడీపీ వాళ్లను కూడా తన్నే పరిస్ధితి రాయలసీమ జిల్లాల్లో వచ్చిందన్నారు. అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే.. కూటమి ప్రభుత్వంలో జనసేన వాళ్లు నామినేషన్ వేయడానికి భయపడే పరిస్ధితి ఉందన్నారు. ఎవరైనా నామినేషన్ వేస్తే విత్ డ్రా చేయించే పరిస్ధితి ఉందన్నారు. నెల్లూరులో టీడీపీ వాళ్లకు వంత పాడే వాళ్లకే జనసేన నామినేషన్లు ఖరారు చేశారన్నారు. విశాఖలో సైతం ఆరుకు బదులు రెండు సీట్లు ఇచ్చారని, అందులో ఒకటి టీడీపీ, మరొకటి వైసీపీకి ఇచ్చారన్నారు. అలా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీతో పాటు జనసేనను సైతం ముంచేద్దామని టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు.

Chandrababu vs YS Jagan Bolisetty Satyanarayana Compares Their Politics in Power and Opposition

బంగారు గుడ్డు పెట్టే బాతు కోసుకు తినే చందంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు వైసీపీ మీద విమర్శలు చేయడం కూడా తప్పని బొలిశెట్టి తెలిపారు. ఇవాళ ప్రెస్ మీట్ లో కూడా శుద్దపూసలా మాట్లాడుతున్నారని, కానీ తెలుగు తమ్ముళ్లు చేసిన దౌర్జన్యాలపై చర్యలు తీసుకుంటామని చెప్పలేదన్నారు. గంటసేపు ప్రెస్ మీట్ పెట్టినా ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరు కానీ, బీజేపీ పేరు ఉచ్చరించాల్సిన అవసరం కానీ, కేంద్ర ప్రభుత్వం గురించి మాత్రం మాట్లాడలేదన్నారు. కూటమికి ఓటేయమని చెప్పడానికి కూడా సంకోచించాల్సిన పరిస్ధితి తమకు ఉందన్నారు. ఎందుకంటే కూటమిలో ఉన్న వాళ్లంతా కూటమి సభ్యులు కాదన్నారు. జనసేనలో ఉన్న వారు కూడా కూటమికీ, జనసేనకు సంబంధించి వారు లేరన్నారు. ప్రస్తుతానికి మంచి వాళ్లకు ఎవరు సీటిస్తే వారికి ఓటేయాలన్నారు. అది కూటమి అయినా, వైసీపీ అయినా, బీజేపీ అయినా, ఇండిపెండెంట్ అయినా ఓటేయాలన్నారు.

Chandrababu vs YS Jagan Bolisetty Satyanarayana Compares Their Politics in Power and Opposition
వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ రాసిన లేఖ ఇదే- బయటపెట్టిన వైసీపీ..!
వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ రాసిన లేఖ ఇదే- బయటపెట్టిన వైసీపీ..!

నాదెండ్ల మనోహర్ సైతం వైసీపీ వాళ్లు తప్పు చేస్తున్నారని లెక్చర్లు ఇస్తున్నారని, అదే లెక్చర్ టీడీపీ వాళ్లు ఎక్కడ తప్పుచేసినా ఇవ్వాలని బొలిశెట్టి సూచించారు. ఆయన సొంత నియోజకవర్గంలో జనసేన నాయకుల్ని టీడీపీ వాళ్లు తంతే దిక్కులేదన్నారు. పైకి మాట్లాడేందుకు జనసేన నేతలకు ధైర్యం లేదా లేక కూటమి గురించి ఆలోచిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. స్థానిక ఎన్నికలతో పర్యావరణానికి చాలా దగ్గర సంబంధం ఉందని, అందుకే తాను మాట్లాడుతున్నట్లు తెలిపారు. రేపు పర్యావరణ నిలబడాలంటే స్థానిక ఎన్నికల్లో మంచి వ్యక్తులు గెలవాలన్నారు. డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తులు వస్తే పర్యావరణాన్ని అమ్మేస్తారన్నారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ ప్రజాస్వామ్యం మీద ఎలాంటి నమ్మకం లేని వ్యక్తులని, వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు నియంతలని, అధికారంలో లేకపోతే మాత్రం సౌమ్యులు ప్రజాస్వామ్యవాదులని తెలిపారు. అందుకే ఎన్నికల్లో వీళ్లద్దరినీ దూరం పెట్టి ఇండిపెండెంట్ వ్యక్తుల్ని బలపరిస్తే బాగుంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+