పుష్కర ప్రమాదం టైంలో అక్కడే బాబు, వెళ్లిపోయారు!: ఎస్పీ బాంబు
రాజమండ్రి: రాజమండ్రిలో గోదావరి పుష్కరాల్లో తొలి రోజు జరిగిన ప్రమాదం పైన ఎస్పీ బాంబు పేల్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. పుష్కరాలు ప్రారంభమైన తొలి రోజు జరిగిన తొక్కిసలాట సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడే ఉన్నారని ఎస్పీ చెప్పినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.
తొలుత నలుగురు చనిపోయారని తాను చంద్రబాబుకు చెప్పానని, ఆ తర్వాత 11 మంది మరణించారని చెప్పానని చెప్పినట్లుగా తెలుస్తోంది. షాకైన సీఎం చంద్రబాబు... వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారని, ఆ తర్వాత అక్కడి నుండి వెళ్లిపోయారని చెప్పారని ఓ ఆంగ్ల పత్రికలో కథనం వచ్చింది.

11 మంది మృతి చెందిన విషయం చంద్రబాబుకు చెప్పామని, ఆయన షాకయ్యారని, సహాయక చర్యలు చేపట్టమన్నారని ఎస్పీ విజయ్ కుమార్ చెప్పారు. ఆ సమయంలో భారీగా తరలి వచ్చిన యాత్రీకులను కంట్రోల్ చేసేందుకు లోపలకి వెళ్లే దారి, బయటకు వచ్చే దారిని ఆపేశారని చెప్పారు.
అంతకుముందు, యాత్రీకులు రెండు గంటలపాటు వేచి చూశారని చెప్పారని తెలుస్తోంది. ఆ తర్వాత ఒక్కసారిగా తోసుకు వచ్చారని చెప్పారు.
ఏర్పాట్లలో కొంత లోటుపాట్లు ఉన్నట్లుగా కూడా చెప్పారు. మరోవైపు, చంద్రబాబు అదే ఘాట్‌కు వస్తారని తెలిసిన భక్తులు, ఆయన వచ్చిన సమయంలోనే, అదే మంచి ముహూర్తంలో (ఉదయం 6.26గంటలకు) పుష్కర స్నానం చేయాలని భావించారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications