వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి థ్యాంక్స్ చెప్పిన చంద్రబాబు: ప్రధాని సారథ్యంలో: నూతన విద్యా విధానానికి జై

|
Google Oneindia TeluguNews

అమరావతి: దేశవ్యాప్తంగా విద్యా విధానంలో సమూల మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ప్రాథమిక విద్యాభ్యాసం మొదలుకుని ఉన్నతస్థాయి విద్య వరకు కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులను తీసుకొచ్చింది. విద్యాభ్యాసాన్ని మరింత సరళీకరించింది. విద్యా వ్యవస్థను పర్యవేక్షించే మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పేరు మార్చడం, 10+2 విధానానికి స్వస్తి పలకడం, మూడేళ్లప్రాయంలోనే చిన్నారులను ప్రీస్కూల్ విద్యాను అందించేలా జాతీయ విద్యా విధానంలో మార్పులను తీసుకొచ్చింది.

కేంద్రం నుంచి గుడ్‌న్యూస్: ఆ అనుమతులు అవసరం లేదంటూ: క్లియరెన్స్‌కు తొలగిన అడ్డంకికేంద్రం నుంచి గుడ్‌న్యూస్: ఆ అనుమతులు అవసరం లేదంటూ: క్లియరెన్స్‌కు తొలగిన అడ్డంకి

దీనిపై కస్తూరి రంగన్ కమిటీ ఇచ్చిన సిఫారసులను ఆమోదించింది. కొత్త జాతీయ విద్యా విధానానికి తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించారు. మాతృభాషను పరిరక్షించేలా జాతీయ విద్యా విధానాన్ని రూపొందించారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఙతలు తెలిపారు. నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం జాతీయ విద్యావిధానంలో సరికొత్త సంస్కరణలను తీసుకొచ్చినట్టయిందని అన్నారు.

 Chandrababu welcome the approval of National Education Policy 2020 by the Union Cabinet

విద్యారంగానికి మరింత ఊతం ఇచ్చినట్టయిందని చెప్పారు. ప్రపంచ దేశాలతో పోటీ పడేలా విద్యారంగాన్ని తీర్చిదిద్దడానికి బాటలు వేసిందని చంద్రబాబు ప్రశంసించారు. అయిదవ తరగతి వరకు మాతృభాష, స్థానిక భాషలు, ప్రాంతీయ భాషల్లో విద్యాబోధన కొనసాగించాల్సిన అవసరం ఉందని తాము ఇదివరకే అభిప్రాయపడ్డామని చంద్రబాబు అన్నారు. కొత్త విద్యా విధానం ఆయా భాషలను సమగ్రంగా పరిరక్షిస్తాయని అన్నారు.

Recommended Video

New National Education Policy 2020: 5+3+3+4 System, New Exams Pattern || Oneindia Telugu

అయిదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన కొనసాగించాలనే నిర్ణయం స్వాగతించదగ్గదని చంద్రబాబు చెప్పారు. మాతృభాషలో విద్యాబోధన కొనసాగడం వల్ల ప్రాథమిక దశలోనే విద్యార్థుల్లో ఆలోచనా శక్తి మెరుగుపడుతుందని అన్నారు. బోధనాంశాలపై పరిశీలనాత్మక శక్తి, అవగాహన పెరగడానికి మాతృభాషలోనే విద్యాబోధన సాగించాలని చెప్పారు. మాతృభాషపై పట్టు సాధించడం వల్ల అన్ని భాషలపైనా విద్యార్థులకు పట్టు లభిస్తుందని చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ట్వీట్లు చేశారు.

English summary
Chandrababu welcome the approval of National Education Policy 2020 by the Union Cabinet chaired by Prime Minister Narendra Modi. He says that I am sure that this reform will boost the education sector and pave way for our youth to compete with the best from across the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X