జూన్ 9న చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు.. కూటమిదే విజయం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ జూన్ 4వ తేదీన జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపైన రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో పాటు, దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని వైసిపి, టిడిపి నేతలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని టిడిపి కూటమినేతలు, వైసిపి మళ్లీ అధికారాన్ని చేపడుతుందని, జగన్ సీఎం అవుతారని వైసిపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో అధికారం ఎవరిది?
ఇక తాజాగా ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారన్న విషయం పైన ఏపీలో బెట్టింగులు సైతం కొనసాగుతున్నాయి. ఏపీలో మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్రంలోనూ బెట్టింగుల పర్వం కొనసాగుతోంది. మళ్లీ అధికారం వైసీపీ దే అని కొందరు, కాదు ఈసారి కచ్చితంగా కూటమి విజయం సాధిస్తుందని మరికొందరు బెట్టింగ్ రాయుళ్ళు కోట్ల రూపాయల బెట్టింగులు కడుతున్నారు.

చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేస్తారు: గంటా శ్రీనివాసరావు
ఇదిలా ఉంటే ఈసారి ఏపీలో విజయం తమదేనని, టిడిపి కూటమి కచ్చితంగా విజయం సాధిస్తుందని తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావు, రఘురామ కృష్ణంరాజు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏపీ ఎన్నికల ఫలితాలపైన ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. సర్వేలన్నీ కూటమిదే గెలుపుని చెబుతున్నాయని టిడిపి నేత గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9వ తేదీన చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన చెబుతున్నారు.
జగన్ చెబితే ఐప్యాక్ టీం చప్పట్లు కొడుతుంది : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసిపికి ఎన్ని సీట్లు వస్తున్నాయో జగన్ చెబుతున్నారని, అది విన్న ఐ ప్యాక్ టీమ్ చప్పట్లు కొడుతుందని ఎద్దేవా చేశారు. ఎన్ని సీట్లు వస్తాయో చెప్పవలసింది ఐ ప్యాక్ టీమ్ కానీ వాళ్ళే చెప్పడం లేదన్నారు. రాష్ట్రంలో అన్ని శాఖలు పడకేశాయని విమర్శించి, వైసీపీనేతలు తనపైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసిపి నేతల్లా తాను అవినీతి చేయలేదని పేర్కొన్న ఆయన నెల్లూరులో దానికి సమాధానం చెబుతానన్నారు.
జూన్ 4 తర్వాత వైసీపీ చాప్టర్ క్లోజ్
ఇక ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడిన రఘురామకృష్ణంరాజు ఈవీఎంల ధ్వంసం పై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జూన్ 4 తర్వాత వైసిపి పని అయిపోతుందని జోస్యం చెప్పారు. ఆ పార్టీ దారుణ పరాజయాన్ని చూడబోతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎస్ ను మారిస్తే అన్ని పరిస్థితులు సర్దుకుంటాయని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలు చేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications