వేయి కోట్లు ఇవ్వండి: కేంద్రానికి చంద్రబాబు లేఖ

విజయవాడ/ మహబూబ్‌నగర్: అకాల వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైన తన రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏపీలో తుపాను, వరదల కారణంగా జరిగిన నష్టనివారణ, పునరావాసం, పునర్నిర్మాణం పనులకు రూ.1000కోట్లు అడ్వాన్స్‌గా విడుదల చేయాలని కోరారు.

లేఖల ప్రతులను ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు పంపించారు. తాత్కాలిక అంచనాల ప్రకారం వివిధ కేటగిరీల కింద రూ.3వేల కోట్ల నష్టం జరిగిందని లేఖలో తెలిపారు. అంతే కాకుండా తుది నివేదిక అంచనాలు వేసి లెక్కలు కట్టిన తర్వాత పంపుతామని చంద్రబాబు తెలిపారు.

 Chandrababu writes letter to centre seeking help

నెల్లూరు నగరంలోని ముంపునకు కాల్వల ఆక్రమణలే కారణమని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ అన్నారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మీడియాతో మాట్లాడారు. వీలైనంత త్వరగా కాల్వల ఆక్రమణలను తొలగిస్తామని మంత్రి చెప్పారు. రెండువేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు.

ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించాలని ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కోరారు. కేంద్రమంత్రి దతా్త్రత్రేయ పాల్గొన్న జాతీయ సదస్సులో స్పీకర్‌ మాట్లాడారు. తన నియోజకవర్గమైన సతైనపల్లిలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించామని కోడెల పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధితో ప్రతి ఒక్కరూ ముదడుగు వేయాలని కేంద్రమంత్రి దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+