ధైర్యవంతుడైన అధికారిని కోల్పోయాం: సిద్ధయ్య మృతిపై జగన్
హైదరాబాద్: ఎస్ఐ సిద్ధయ్య మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సిద్ధయ్య కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
ధైర్యవంతుడైన అధికారిని కోల్పోయాం: జగన్
ఒక ధైర్యవంతుడైన పోలీసు అధికారిని కోల్పోయామని వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా జానకీపురంలో శనివారం ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సిద్ధయ్య మంగళవారం సాయంత్రం మరణించారు. నాలుగు రోజులుగా ఆయన ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు కృషి చేసినా ఫలితం లేకపోయింది.

స్మగ్లర్లను హతమార్చడంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: వాసిరెడ్డి
ఎర్రచందనం స్మగ్లర్ల పేరుతో అమాయక కూలీలను హతమార్చడం దారుణమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి అన్నారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.
కూలీల వద్ద ఆయుధాలు ఏమైనా ఉన్నాయా, వారేమైనా కాల్పులు జరిపారా? అని ప్రశ్నించారు. ఏపి సిఎం చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ ఎన్‌కౌంటర్ జరిగిందన్న అనుమానం కలుగుతోందన్నారు. ప్రభుత్వ అనాలోచిత చర్యతో పోరుగు రాష్ట్రాల ముందు దోషులుగా నిలిచే పరిస్థితి తలెత్తిందని వాసిరెడ్డి పద్మ అన్నారు.












Click it and Unblock the Notifications