మన తెలివి తట్టుకోలేకే: అమెరికా దాడులపై బాబు, పంపండి.. సుష్మాకు జగన్

మన తెలివి తేటలు చూసి తట్టుకోలేకనే అమెరికాలో మన వాళ్ల పైన దాడులు చేస్తున్నారని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు అన్నారు.

విజయవాడ: మన తెలివి తేటలు చూసి తట్టుకోలేకనే అమెరికాలో మన వాళ్ల పైన దాడులు చేస్తున్నారని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు అన్నారు.

ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అమెరికాలో మన వాళ్ల పైన దాడులు చాలా బాధాకరమన్నారు. దాడులను అమెరికా వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు.

సుష్మా స్వరాజ్‌కు జగన్ లేఖ

కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు లేఖ రాశారు. అమెరికాలో జాత్యాహంకార దాడుల నేపథ్యంలో హైలెవల్ కమిటీని అమెరికాకు పంపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా అమెరికా చర్యలు తీసుకునేలా చూడాలన్నారు. ఎన్నారైలలో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించే చర్యలు చేపట్టాలని జగన్ కోరారు.

 Chandrababu and YS Jagan on Kansas firing

భారతీయులు ముందంజ

కష్టించి పనిచేసే తత్వంతో పాటు ఏ దేశంలో ఉన్నా ఆ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడంలో భారతీయులు ముందుంటారు. గూగుల్‌కు సుందర్‌ పిచాయ్, మైక్రోసాఫ్ట్‌కు సత్యా నాదెళ్ల, పెప్సీ కంపెనీకి ఇంద్రానూయి, మాస్టర్ కార్డ్‌ సీఈవోగా అజయ్‌ బంగా, అడోబ్‌ సీఈవోగా శంతను నారాయణ్‌ తదితరులు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+