వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలహీనపరుస్తారా, మీ లాలూచీ బయటపెడ్తా: పవన్‌కు బాబు దిమ్మ తిరిగే కౌంటర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

రాష్ట్ర విభజన కారణంగా నష్టపోయిన ఏపీ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని చంద్రబాబునాయుడు కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు అవిశ్వాసం పెట్టినా తాము మద్దతుగా నిలుస్తామని ఆయన చెప్పారు.
తనకు ఎలాంటి భయం, స్వార్ధం లేదన్నారు. రాష్ట్రం కోసం ఎలాంటి త్యాగాలను చేసేందుకైనా తాను సిద్దంగా ఉన్నానని చెప్పారు.

ఎమ్మెల్యేగా అడుగుపెట్టి చంద్రబాబునాయుడు 40 ఏళ్ళు పూర్తైన సందర్భంగా ఏపీ అసెంబ్లీ ఆయనను అభినందిస్తూ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు బాబును అభినందిస్తూ మాట్లాడారు. ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత చంద్రబాబునాయుడు తన రాజకీయ జీవితం గురించి అసెంబ్లీలో మాట్లాడారు.

కాంగ్రెసేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో తాను కీలక పాత్ర పోషించానని ఆయన చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2004 నుండి 2009 వరకు చోటు చేసుకొన్న ఘటనలను బాబు ప్రస్తావించారు.

ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే

ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే

న్యాయాన్ని, అన్యాయాన్ని ఏపీ ప్రజలు బేరీజు వేసుకొంటారు. కేంద్రాన్ని చాలాసార్లు కోరాను. ప్రజల మనోభావాలతో ఆడుకోకూడదు. భవిష్యత్తులో చాలా ప్రమాదాలు వస్తాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విభజన చట్టంలో పెట్టిన హమీలను అమలు చేయాలని కోరాను. ప్రత్యేక హోదా ఇవ్వాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. కొన్ని రాజకీయపార్టీలు , వ్యక్తులు లాలూచీ పడ్డారనే విషయాన్ని అన్ని విషయాలను లాలూచీ పడి సహకరించినా ఎండగట్టినా సహకరిస్తాం. చరిత్ర హీనులుగా మిగిలిపోతారని బాబు చెప్పారు.ప్రజలే నాకు హై కమాండ్.

బలహీనపర్చొద్దని పవన్‌కు కౌంటర్

బలహీనపర్చొద్దని పవన్‌కు కౌంటర్

కేంద్రంపై నేను నాలుగేళ్ళుగా కేంద్రంపై పోరాడుతున్నానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. 29, సార్లు ఢిల్లీకి వెళ్ళానని ఆయన చెప్పారు. నేనే పోరాటాన్ని ప్రారంభించినట్టు చంద్రబాబునాయుడు చెప్పారు. ఎంపీలు పోరాటం చేస్తున్నారని చెప్పారు. నా పట్ల విమర్శలు చేసే వారు ఆలోచించుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పరోక్షంగా పవన్ కళ్యాణ్‌కు కౌంటరిచ్చారు. రాజకీయ ప్రయోజనాలు ముఖ్యంగా తీసుకోకూడదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రయోజనంగా తీసుకోవాలన్నారు. రాష్ట్రం కోసం కేంద్రంపై పోరాటం చేసే సమయంలో నన్ను బలహీనపరిస్తే రాష్ట్రానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని బాబు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనం విషయంలో నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఎవరు ఎవరితో లాలూచీ పడుతున్నారో అన్ని విషయాలను బయటపెట్టనున్నట్టు బాబు చెప్పారు.

 విభజన కష్టాలను ఆదుకోవాలి

విభజన కష్టాలను ఆదుకోవాలి

60 ఏళ్ళ పాటు సంపద సృష్టించిన హైద్రాబాద్‌‌ నుండి అమరావతికి పంపించేశారని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనను తాము కోరుకోలేదని ఆయన చెప్పారు. తమ నెత్తిమీద విభజనను రుద్దారని ఆయన చెప్పారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో ఆనాడు ఇచ్చిన హమీలను అప్పటి కేంద్ర ప్రభుత్వం, ఆనాడు విపక్షం హమీలుఇచ్చిందని చెప్పారు. రాష్ట్రాన్ని విభజన కష్టాల నుండి ఆదుకోవాలని చంద్రబాబునాయుడు కోరారు. ఇందు కోసం తాను ఎలాంటి త్యాగానికైనా సిద్దమేనని బాబు చెప్పారు.

2004 నుండి 2009 వరకు అనేక కష్టాలు పడ్డా

2004 నుండి 2009 వరకు అనేక కష్టాలు పడ్డా

ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుండి 2014 వరకు తీవ్రంగా సంక్షోభాలను ఎదుర్కొన్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. తీవ్రంగా తనను పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశారని ఆయన చెప్పారు. అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో ఉన్న పరిటాల రవీంద్రను హత్య చేశారని చంద్రబాబునాయుడు చెప్పారు. అనంతపురం జిల్లాలో రోజుకో పార్టీ నేత, కార్యకర్త హత్యకు గురయ్యారని బాబు చెప్పారు. అన్ని సమస్యలను అధిగమించి 2014లో ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్టు చెప్పారు.

 నా మీద నమ్మకంతోనే పట్టం కట్టారు

నా మీద నమ్మకంతోనే పట్టం కట్టారు

ప్రజలు తనపై నమ్మకంతోనే ఏపీ ప్రజలు ముఖ్యమంత్రిగా అధికారాన్ని అప్పగించారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. అంతేకాదు ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు ఏకపక్షంగా టిడిపికి పట్టం కట్టారని చెప్పారు. అయితే తనపై నమ్మకం ఉంచిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోనని చంద్రబాబునాయుడు చెప్పారు.

నిప్పుతో చెలగాటమాడొద్దు

నిప్పుతో చెలగాటమాడొద్దు

నిప్పుతో చెలగాటమాడొద్దని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. తనను బలహీనపర్చేందుకు ఎవరెవరు ఎవరెవరితో లాలూచీలు పడుతున్నారో రానున్న రెండు రోజుల్లో బయటపెట్టనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. రాజకీయ స్వార్ధం కోసం ప్రజలను బలిచేయకూడదన్నారు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకు తీసుకొనే నిర్ణయాలు భవిష్యత్తులో ప్రజలకు నష్టాన్ని కల్గిస్తాయని బాబు చెప్పారు.

English summary
Ap chief minister Chandrababu naidu demanded to union government give special status Andhra pradesh. Chandrababu naidu address in Ap Assembly on Thursday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X