అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తొందరపడ్డారు:కెసిఆర్-పయ్యావుల రహస్య భేటీపై బాబు సీరియస్

అనంతపురంలో కెసిఆర్ టూర్‌లో చోటుచేసుకొన్న పరిణామాలపై బాబు సీరియస్పార్టీ నేతలు వెంకటాపురంలో తొందరపడ్డారని చంద్రబాబు అభిప్రాయపడ్డారుపయ్యావుల కేశవ్, కెసిఆర్ రహస్య భేటీ అంటూ గందరగోళం సృష్టించారన్న బాబు

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహనికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వచ్చిన సందర్భంగా చోటు చేసుకొన్న పరిణామాలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ సీఎం కెసిఆర్ వెంకటాపురం వచ్చిన సమయంలో కొందరు నేతలు తొందరపడ్డారని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం నాడు అమరావతిలో జరిగింది. ఇంటింటికి టిడిపి కార్యక్రమంతో పాటు ఇటీవల చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించారు.

Recommended Video

పరిటాల శ్రీరామ్‌తో ఆలింగనం, బాబుకు చేయి.. కేసీఆర్‌కు 'అనంత' స్వాగతం, ఎగబడ్డ జనం..! | Oneindia Telugu

ఇంటింటికి టిడిపి కార్యక్రమంపై ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

పరిటాల శ్రీరామ్ వివాహనికి తెలంగాణ సీఎం కెసిఆర్ వచ్చిన సమయంలో చోటుచేసుకొన్న పరిణామాలపై పార్టీ నేతలతో బాబు చర్చించారు.ఆ రోజు చోటుచేసుకొన్న పరిణామాలు ఎవరికి ప్రయోజనం కల్గిస్తాయో ఆలోచించాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు.

కెసిఆర్ అనంతపురం టూర్‌లో కొందరు తొందరపడ్డారు

కెసిఆర్ అనంతపురం టూర్‌లో కొందరు తొందరపడ్డారు

ఈ నెల 1వ, తేదిన అనంతపురం జిల్లా వెంకటాపురంలో మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహం జరిగింది. ఈ వివాహనికి తెలంగాణ సిఎం కెసిఆర్ కూడ హజరయ్యారు. అయితే తెలంగాణ సీఎం కెసిఆర్ వెంకటాపురానికి హజరైన సమయంలో కొందరు టిడిపి నేతలు తొందరపడ్డారని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు..కెసిఆర్ పర్యటన సందర్భంగా ఎందుకు తొందరపడ్డారని బాబు ప్రశ్నించారు.

పయ్యావులతో కెసిఆర్ భేటీపై గందరగోళం

పయ్యావులతో కెసిఆర్ భేటీపై గందరగోళం

తెలంగాణ సీఎం కెసిఆర్‌తో టిడిపి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ రహస్య భేటీ అంటూ గందరగోళం సృష్టించారని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారని సమాచారం. వీరిద్దరి మధ్య రహస్యభేటీ అంటూ సాగిన ప్రచారంపై బాబు కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం.ఎవరికీ రాజకీయంగా మేలు జరుగుతోందో ఆలోచించాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు.

నేతల ప్రవర్తనపై చరిత్ర ఉంది

నేతల ప్రవర్తనపై చరిత్ర ఉంది

రాష్ట్రంలో పార్టీ నేతల చిట్టా తన వద్ద ఉందని చంద్రబాబునాయుడు సమన్వయకమిటీ సమావేశంలో హెచ్చరించారు. ఏ నాయకుడు ఏ సమయంలో ఎలా వ్యవహరిస్తున్నారనే విషయమై తన వద్ద నివేదికలు ఉన్న విషయాన్ని బాబు ప్రస్తావించారు. ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగించాలని బాబు సూచించారు.

ప్రజల నుండి15 లక్షల ఫిర్యాదులు

ప్రజల నుండి15 లక్షల ఫిర్యాదులు

ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో ప్రజల నుండి 15 లక్షల ఫిర్యాదులు వచ్చాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు పార్టీ నేతలు చెప్పారు. ముఖ్యంగా ప్రజల నుండి ఏ రకమైన ఫిర్యాదులు వచ్చాయనే విషయమై పార్టీ నేతలు బాబుకు వివరించారు. అయితే ప్రజల నుండి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గృహనిర్మాణాల విషయాలపై ప్రధానమైన డిమాండ్ ఉందని నేతలు అభిప్రాయపడ్డారు.

English summary
Tdp chief Chandrababu naidu warned to party leaders over reaction on Telangana Cm Kcr tour in Venkatapuram on Oct 1.chandrababu dissatisfied on Tdp leaders attitude in Paritala sriram marriage. Chandrababu conduted coordination meeting with party leaders at Amaravati on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X