ప్రధాని మోదీ - అమిత్ షా చేతికి చంద్రబాబు బ్రహ్మాస్త్రం..!!

టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రంగా ఇప్పుడు కొత్త రాజకీయం మొదలైంది. కర్నూలు పర్యటనలో భాగంగా చంద్రబాబు ఈ ఎన్నికల్లో గెలిపిస్తే సరే...లేకుంటే ఇవే చివరి ఎన్నికలు అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలంటూ ఆయన వ్యాఖ్యలను వ్యంగంగా సమర్ధిస్తున్నారు. ఇదే సమయంలో మరో ఆసక్తి కర చర్చ మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో పట్టుకోసం ప్రయత్నిస్తున్న బీజేపీకి చంద్రబాబు తాజా వ్యాఖ్యలు అస్త్రంగా మారనున్నాయి. కొత్త ఆశలకు అవకాశంగా మారుతున్నాయి.

చంద్రబాబు ఎమోషనల్ సెంటిమెంట్ డైలాగ్స్

చంద్రబాబు ఎమోషనల్ సెంటిమెంట్ డైలాగ్స్


చంద్రబాబు ప్రజల్లో సానుభూతి కోసం..ఎమోషనల్ రాజకీయాన్ని మొదలు పెట్టినట్లుగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న చంద్రబాబు.. ప్రతీ అవకాశం సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఇప్పుడు సెంటిమెంట్ పంచుతూ.. ఎమోషనల్ డైలాగ్స్ తో ముందుకు వెళ్తున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో గెలవకపోతే ఇక తాను రాజకీయాల్లో ఉండననే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. సరిగ్గా ఏపీలో ఇటువంటి అవకాశం కోసమే బీజేపీ పొంచి ఉంది. టీడీపీ.. బీజేపీ కి ఏపీలో దాదాపుగా ఒకే రకమైక ఓట్ బ్యాంక్. గతంలో బీజేపీతో పొత్తు కారణంగా టీడీపీ లాభపడింది కానీ, బీజేపీకి దీర్ఘకాలికంగా కలిగిన ప్రయోజనం లేదని కమలం పార్టీ నేతలు పలు మార్లు ప్రస్తావించారు.

సమయం కోసం వేచి చూస్తోన్న బీజేపీ

సమయం కోసం వేచి చూస్తోన్న బీజేపీ


తాజాగా ప్రధాని మోదీ విశాఖ పర్యటనలోనూ ఏపీలో పార్టీ బలం పెంపుపైన చర్చలు చేసారు. ప్రధాని మోదీ - అమిత్ షా ఇద్దరూ ఏపీలో బీజేపీ ఎదుగుదల పైన ఫోకస్ పెట్టిన సమయంలో.. ఇప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. అటు చంద్రబాబు జనసేన..ఇటు బీజేపీతో కలిసి ఎలాగైనా అధికారంలోకి రావాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. అటు పవన్ కు ప్రధాని భేటీతో బ్రేకులు పడినట్లు ప్రచారం సాగుతోంది. ఇక, వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమని చెప్పాల్సిన సమయంలో..ఇలాంటి వ్యాఖ్యల ద్వారా చంద్రబాబులోనే నమ్మకం లేదా అనే భిన్న కోణంలో చర్చ మొదలైంది. ఇదే వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఇక, వచ్చే ఎన్నికల్లో నిజంగా టీడీపీ ఓడిపోతే..ఆ స్థానం భర్తీ చేసేందుకు బీజేపీ ముందుకొస్తుందని స్వయంగా వైసీపీ మంత్రులే చెబుతున్నారు.

వరంగా మారుతుందా- బూమ్ రాంగ్ అవుతుందా

వరంగా మారుతుందా- బూమ్ రాంగ్ అవుతుందా

ఇటువంటి అవకాశాలు అంది పుచ్చుకోవటంలో సిద్ద హస్తులైన మోదీ - అమిత్ షా ద్వయానికి తాజాగా చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలతో కొత్త అస్త్రం అందించినట్లయిందని విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటి వరకు వైసీపీ నేతలు వరుసగా చంద్రబాబు వ్యాఖ్యల పైన స్పందిస్తున్నా..తమ పార్టీ అధినేత వ్యాఖ్యలకు మద్దతుగా టీడీపీ నేతలెవరూ ముందుకు రాలేదు. వాస్తవంగా బీజేపీ రానున్న ఎన్నికల్లో టీడీపీతో కలిసేందుకు సిద్దంగా లేదని..పవన్ ను దూరం చేసే ప్రయత్నం చేస్తోందనేది ఓపెన్ సీక్రేట్. ఈ సమయంలో.. చంద్రబాబు కారణం ఏదైనా తాజాగా చేసిన వ్యాఖ్యలతో సీన్ రివర్స్ అయ్యే ప్రమాదం పొంచి ఉందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చంద్రబాబు తాజా వ్యాఖ్యలు బీజేపీ నేతల్లో భవిష్యత్ పైన ఆశలు పెంచేవిగా ఉన్నాయనేది వారి అంచనా. దీంతో, ఇప్పుడు చంద్రబాబు వ్యాఖ్యల ప్రభావం ఓటర్లలో ఏ మేర ప్రభావం చూపిస్తుందనే అంచనాలు మొదలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+