చంద్రబాబు గ్రాఫ్ దారుణంగా పడిపోయింది..వీడియో వైరల్
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి ఏపీ సీఎం చంద్రబాబు పాలనపై చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాలపై రేణుకా చౌదరి తనదైన శైలిలో స్పందించారు. ఏపీలో కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా యాంకర్ సీఎం చంద్రబాబు పాలన గురించి ప్రశ్నించగా, ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు.
సీఎం చంద్రబాబు గ్రాఫ్ తొందరగా పడిపోయిందని చెప్పి రేణుకా చౌదరి సంచలనం సృష్టించారు. ఇలా చెబుతున్నందుకు నన్ను క్షమించాలని కూడా ఆమె కోరడం జరిగింది. జగన్ ఓడిపోతే చంద్రబాబు వస్తే ఏదో ఉద్దరిస్తారని అంతా భావించామని, కానీ ఆయన కేంద్రంలోని బీజేపీ చెప్పినట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. బీజేపీ వాళ్ల చేతులు పట్టుకుని, వాళ్లు చెప్పినట్టు ముందు చూపు లేకుండా చెప్పడం చంద్రబాబు చేస్తోన్న పెద్ద తప్పుగా రేణుకా చౌదరి అభివర్ణించారు.

ఎన్నో ఆశలతో ఎదురు చూశామని, కానీ ఆ ఆశలకు తగ్గట్టు చంద్రబాబు పాలన లేదని ఆమె తేల్చేశారు. ప్రజలకు , ఆయనకు గ్యాప్ వచ్చిందని రేణుకా చౌదరి తెలిపారు. పాలన అనుభవం ఉంది కాబట్టే, ఆయనపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారని, కానీ ఆయన పాలన మాత్రం అంతగా ఆకట్టుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు.చంద్రబాబు తన పాలనతో పూర్తిగా నిరాశ పరిచారని ఆమె ఈ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. పాలనపై సొంత నిర్ణయాలు లేవని ఆమె అభిప్రాయపడ్డారు.
గత జగన్ పాలనకు వ్యతిరేకంగా పలు సందర్భాల్లో రేణుకా చౌదరి తన గళాన్ని విప్పారు. అమరావతి రైతులకు మద్దతుగా వారు చేసిన ధర్నాలో కూడా నేరుగా పాల్గొన్నారు. ఇటీవల జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆమె వార్తల్లో కూడా నిలిచారు. గతంలో చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడిన రేణుకా చౌదరి, ఇప్పుడు ఇలా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సంచలనంగా మారింది. చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను వైసీపీ తమ సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్ చేస్తుంది.












Click it and Unblock the Notifications