Chandra Babu Cabinet: సీనియర్ల ఆశలపై చంద్రబాబు నీళ్లు..!!
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తో సహా 25 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అర్ద్రరాత్రి దాటిన తరువాత కొత్త మంత్రుల జాబితాను చంద్రబాబు ప్రకటించారు. జనసేనకు 3, బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు..పలువురు సీనియర్లకు ఛాన్స్ ఇవ్వకోవటం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారుతోంది.
చంద్రబాబు కూర్పు
చంద్రబాబు తన కొత్త కేబినెట్ లో యువతకు ప్రాధాన్యత పెంచారు. పార్టీలో చాలా కాలంగా ఉన్న సీనియర్లకు మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. సీనియర్లలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నారాయణ, ఫరూక్, లోకేష్ గతంలో మంత్రి పదవి నిర్వహించారు. తిరిగి వారికి ఇప్పుడు అవకాశం దక్కింది. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డి, పార్దసాధరికి తాజా మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ లో చాలా కాలం మంత్రి పదవులు దక్కని పయ్యావుల కేశవ్..వైసీపీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న డోలా బాల వీరాంజనేయ స్వామి.. గొట్టిపాటి రవి కుమార్ కు మంత్రి పదవులు దక్కాయి. గుంటూరు జిల్లా నుంచి అనూహ్యంగా అనగాని సత్యప్రసాద్ కు చంద్రబాబుకు మంత్రిపదవి ఖరారు చేసారు.

సీనియర్లకు నో ఛాన్స్
ఇక..ఉత్తరాంధ్రలో కళా వెంకటరావు, గంటా శ్రీనివాస రావు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ..గోదావరి జిల్లాల నుంచి చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పితాని సత్యనారాయణ, బోండా ఉమా, తంగిరాల సౌమ్య, యరపతినేని, కన్నా లక్ష్మీనారాయణ, ధూళిపాళ్ల నరేంద్ర, జీవీ ఆంజనేయులు, దామచర్ల జనార్ధన్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, పలమనేరు నుంచి గెలుపొందిన అమర్నాధ్ రెడ్డి వంటి వారు ఈ సారి ఖాయంగా మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ, చంద్రబాబు కొత్త ఫార్ములా అమలు చేసారు. ఉమ్మడి జిల్లాలవారీగా గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు అత్యధికంగా మూడేసి మంత్రిపదవులు దక్కాయి. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు రెండేసి లభించాయి.

ఎంపిక వెనుక
టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, సీనియర్ నాయకురాలు గుమ్మడి సంధ్యారాణి, కొత్తగా ఎన్నికైన సవితకు కూడా మంత్రి పదవులు లభించాయి. జనసేనాని పవన్ కల్యాణ్, కందుల దుర్గేశ్, సవిత సహా కొత్తగా ఎన్నికైన 8 మంది ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో చోటు కల్పించారు. 21 మంది ఎమ్మెల్యేలున్న జనసేనకు మూడు, 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి ఒకటి (సత్యకుమార్).. 135 స్థానాలున్న టీడీపీకి సీఎం సహా 21 మంత్రి పదవులు లభించాయి. పదవులు పొందిన బీసీ నేతల్లో ఇంకా కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్, సత్యకుమార్, సవిత ఉన్నారు. అయితే..పార్టీ ఆవిర్బావం నుంచి సీనియర్లకు మంత్రిగా ఛాన్స్ దక్కకపోవటంతో ఇప్పుడు వారి స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications