Nara Bhuvaneswari: మళ్లీ భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర-ఉత్తరాంధ్రలో 3 రోజుల పాటు..
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీలు జనంలోకి విస్తృత పర్యటనలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో గతంలో విపక్ష నేత చంద్రబాబు అరెస్టు, జైలు నేపథ్యంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి ప్రారంభించిన నిజం గెలవాలి యాత్ర.. ఆయనకు బెయిల్ వచ్చాక ఆగిపోయింది. తిరిగి దాన్ని రేపటి నుంచి ప్రారంభించేందుకు భువనేశ్వరి సిద్ధమవుతున్నారు. అదే సమయంలో చంద్రబాబు, లోకేష్ కూడా వరుస టూర్లకు ప్లాన్ చేశారు.
గతంలో చంద్రబాబును స్కిల్ స్కాంలో సీఐడీ అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపాక నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో ఓ యాత్ర ప్రారంభించారు. చంద్రబాబు అరెస్టుతో చనిపోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను కలుసుకునే లక్ష్యంతో ఆమె ప్రారంభించిన నిజం గెలవాలి యాత్ర చేస్తుండగానే చంద్రబాబుకు బెయిల్ లభించడం, జైలు నుంచి విడుదల కావడం జరిగిపోయాయి. దీంతో భువనేశ్వరి యాత్ర కూడా నిలిచిపోయింది.

తిరిగి నిజం గెలవాలి యాత్రను ప్రారంభించేందుకు నారా భువనేశ్వరి సిద్ధమయ్యారు. చంద్రబాబు అరెస్టుతో అప్పట్లో చనిపోయిన కుటుంబాలను తిరిగి ఉత్తరాంధ్రలో పరామర్శించేందుకు భువనేశ్వరి వెళ్లనున్నారు. ఈ యాత్రను విజయనగరం జిల్లాలో ప్రారంభిస్తారు. అనంతరం ఎల్లుండి శ్రీకాకుళంలో, ఈ నెల 5న విశాఖలో కొనసాగిస్తారు. ప్రస్తుతానికి ఇక్కడే వరకే షెడ్యూల్ ఖరారు చేశారు. అదే సమయంలో చంద్రబాబు, నారా లోకేష్ పర్యటనలు కూడా ఖరారయ్యాయి.
ఈ నెల 5 నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనలు ప్రారంభిస్తారు. 25 పార్లమెంట్ స్థానాల పరిధిలో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించేలా ప్లాన్ చేశారు. కనిగిరిలో ఈ నెల 5న చంద్రబాబు తొలి బహిరంగ సభ ఉంటుంది. ఇలా సాగే ప్రతి సభకు లక్ష మంది హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సంక్రాంతి వరకు మంగళగిరిలో విస్తృతంగా పర్యటించేందుకు నారా లోకేష్ ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ఇంటింటికి వెళ్తున్నారు. సంక్రాంతి తర్వాత పాదయాత్రలో కవర్ అవ్వని నియోజక వర్గాలకు నారా లోకేష్ వెళ్ళనున్నారు.












Click it and Unblock the Notifications