చందనఖాన్‌కు 'టీ' చేదు, లోకసభలో ఎంపీల నినాదాలు

ఎంసెట్ కౌన్సెలింగ్ పైన విచారణ మధ్యాహ్నం
ఎంసెట్ కౌన్సెలింగ్ పైన సుప్రీం కోర్టు మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది. తమ న్యాయవాది హరీష్ సాల్వే కోసం తెలంగాణ ప్రభుత్వం పాస్ ఓవర్ అడిగింది. కౌన్సెలింగ్ పైన సర్వోన్నత న్యాయస్థానం మధ్యాహ్నం విచారించి తుది ఉత్తర్వులు వెలువరించే అవకాశముంది.
లోకసభలో తెరాస ఎంపీల నినాదాలు
సోమవారం లోకసభ సమావేశాలు ప్రారంభం కాగానే తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు ఎన్డీఏ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓ వైపు లోకసభలో చర్చ జరుగుతుండగానే ఎంపీలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి జై తెలంగాణ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు.
హైదరాబాద్‌లో శాంతిభద్రతల అధికారాలను గవర్నర్‌కు కట్టబెట్టాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌ను స్తంభింపజేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎంపీలను ఆదేశించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications