చంద్రయాన్ 3: జాతికి గర్వకారణం: పవన్ కళ్యాణ్; మహత్తర ప్రయోగానికి సాక్షిని: మహేష్ బాబు!!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసిన చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కావడంతో దేశవ్యాప్తంగా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు చంద్రయాన్ 3 సక్సెస్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
రాజకీయ ప్రముఖులతో పాటు సినీరంగ ప్రముఖులు కూడా అంతరిక్ష పరిశోధనలు ఇస్రో శాస్త్రవేత్తల మరో ముందడుగును ప్రశంసిస్తున్నారు. చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. చంద్రయాన్-3ని విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అలుపెరుగని కృషిచేశారనిఆయన పేర్కొన్నారు. నేడు వారి శ్రమ ఫలించిందని తెలిపారు.
చంద్రయాన్ వంటి ప్రయోగం వల్ల అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రరాజ్యంగా భారత్ ఆవిర్భవించడం జాతి అంతటికి గర్వకారణమన్నారు. అంతరిక్షరంగంలో చంద్రయాన్-3 సత్తాచాటిందన్నారు పవన్ కళ్యాణ్. టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగంపై స్పందించిన ఆయన మరో మహత్తరమైన ప్రయోగానికి సాక్షిగా ఉన్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో కీలకమైన చంద్రయాన్ - 3 ఈరోజు అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా, జనసేన పార్టీ తరపున @isro కి అభినందనలు తెలియజేస్తూ, చంద్రయాన్ - 3 విజయవంతంగా చంద్రుడిని చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాము.#Chandrayaan3Launching #Chandrayaan3Launch… pic.twitter.com/JqgOq4xDiB
— JanaSena Party (@JanaSenaParty) July 14, 2023
ఈ రోజు చంద్రయాన్-3ని ప్రారంభించినందుకు ఇస్రోలోని అద్భుతమైన బృందానికి అభినందనలు అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. మీరు దేశానికి గర్వకారణం. దేశం సగర్వంగా తలెత్తుకునేలా చేస్తున్నారు అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశాడు. ఆయన ట్వీట్ దేశం పట్ల ఆయనకున్న ప్రేమను, నిబద్ధతను చెప్తుంది.
Onward to greater horizons! Thrilled to witness another momentous launch! Congratulations & all the best to the brilliant team at ISRO for the launch of #Chandrayaan3 today! Proud of you all! 👍👍
— Mahesh Babu (@urstrulyMahesh) July 14, 2023

చంద్రయాన్ 3 శ్రీహరికోట నుండి నేడు ప్రయోగించబడిన భారత వ్యోమ నౌక నేడు భూ కక్షలోకి ప్రవేశించింది. ఆపై 24 రోజుల పాటు భూమి చుట్టూ ప్రదక్షణ చేయనుంది. ఆ తర్వాత చంద్రుడి వైపు పయనించి ఆగస్టు 23 లేదా 24వ తేదీన చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండ్ కానుంది. చంద్రుడి ఉపరితలంపై అధ్యయనం చేయనుంది.
ప్రపంచ దేశాలకు ధీటుగా ఇస్రో పరిశోధనలు చేస్తున్న క్రమంలో చంద్రయాన్ 3 ప్రయోగం ఒక అద్భుతమైన మైలురాయి అని పలువురు ప్రశంసిస్తున్నారు. ఇస్రో సత్తాకు ఇది నిదర్శనంగా నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రుడు పైన సేఫ్ గా చంద్రయాన్ 3 ల్యాండ్ కావాలని, ఇది భారతదేశ అంతరిక్ష రంగ పురోగతికి ఉపయోగపడాలని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.












Click it and Unblock the Notifications