చంద్రయాన్ 3 సక్సెస్: ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్ అంటూ ప్రధాని మోడీ ట్వీట్!!
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి చంద్రయాన్ 3 నింగికి ఎగిసింది. బాహుబలి రాకెట్ గా గుర్తింపు పొందిన ఎల్వీఎం 3 ఎం4 దీనిని మోసుకువెళ్ళింది. చందమామ దిశగా దూసుకు వెళ్లిన చంద్రయాన్ 3 ఆగస్టు 23వ తేదీన చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది.
మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు నిప్పులు కక్కుతూ చంద్రయాన్ 3 దూసుకుపోయింది. కక్షలోకి ప్రవేశించిన స్పేస్ క్రాఫ్ట్ జాబిల్లి దిశగా దూసుకుపోతోంది. ల్యాండర్ మరియు రోవర్ తో చంద్రయాన్ 3 గగనతలం లోకి వెళుతుంది. దీంతో ఇస్రో మరో రికార్డును సృష్టించినట్లు అయింది.

భారతదేశం చంద్రయాన్ 3 పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ చంద్రయాన్ 3 ప్రయోగానికి ముందు అంతరిక్ష రంగంలో జూలై 14 2023 సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని పేర్కొన్నారు. చంద్రుడి పై చంద్రయాన్ 3 ప్రయాణం మొదలవుతుందని, కోట్లాదిమంది భారతీయుల ఆశలను ఈ మిషన్ నింగిలోకి మోసుకువెళుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.
ఇక చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కావడంతో దేశం మొత్తం సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 3.5 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన చంద్రయాన్ 3 విజయవంతంగా కక్షలోకి ప్రవేశించడంతో భారతీయులలో సంతోషం వ్యక్తమౌతుంది. దీంతో ప్రస్తుతం ఫ్రాన్స్ లో రెండు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీ చంద్రయాన్ 3 విజయవంతం పై హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
Chandrayaan-3 scripts a new chapter in India's space odyssey. It soars high, elevating the dreams and ambitions of every Indian. This momentous achievement is a testament to our scientists' relentless dedication. I salute their spirit and ingenuity! https://t.co/gko6fnOUaK
— Narendra Modi (@narendramodi) July 14, 2023
చంద్రయాన్ 3 భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించిందని, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన రోజని ఆయన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. చంద్రయాన్ 3 ప్రతి భారతీయుడి కలలను, ఆశయాలను ఉన్నతంగా ఉంచుతుందని, ఈ మహత్తర విజయం మన శాస్త్రవేత్తల నిర్విరామ అంకితభావానికి నిదర్శనమని, వారిలోని స్ఫూర్తికి, నైపుణ్యానికి తాను సెల్యూట్ చేస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications