Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుమల సాక్షిగా... ప్రధాని మోదీపై ఆంధ్రప్రదేశ్ ప్రజల ఛార్జ్ షీట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్న క్రమంలో నేడు మరో మారు ఏపీలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీపై ఆంధ్రప్రదేశ్ ప్రజల చార్జిషీట్ ను ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల విడుదల చేశారు. ఈ ఛార్జ్ షీట్ లో గడచిన పదేళ్లలో మోడీ దేశానికి ప్రధానిగా అన్ని వర్గాల వారిని మోసం చేశారని మతం పేరుతో ద్వేషపు కోరలు చాచి దేశ ఐక్యతను, ప్రజల మధ్య సోదర భావాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారన్నారు.

మోదీ పాలనలో ఏపీ సర్వ నాశనం
మోడీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అతి తీవ్రంగా నష్టపోయి, అన్ని విధాలుగా సర్వనాశనం అయిందని, విభజన చట్టంలో కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క వాగ్దానాన్ని కూడా ఏపీ ఏర్పడిన మొదటి ఐదేళ్లలో టీడీపీతో కలిసి ఉన్నప్పుడు కూడా నెరవేర్చలేదని పేర్కొన్నారు. అటు కొడుకు కోసం చంద్రబాబు ఇటు కేసుల భయంతో జగన్ ఇద్దరు బీజేపీని ఎదిరించి నిలదీసే ధైర్యం చేయలేదన్నారు.

Charge sheet against Prime Minister Modi by Andhra Pradesh people ys sharmila

ఏ మొహంతో ఏపీ వస్తున్నారు
ఈరోజు మళ్లీ ఏ టిడిపితో తిట్టించుకున్నారో.. ఏ టీడీపీని అయితే తిట్టారో మళ్లీ ఎన్నికల్లో వారితోనే కలిసి ప్రధాని మోడీ పోటీ చేస్తున్నారన్నారు. అయితే వాళ్లతో మాత్రమే కాదు తెరచాటు జగన్ తో కూడా దోస్తీ చేస్తున్నారని ఇంత సిగ్గుమాలిన రాజకీయం చేస్తూ, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ, అటు రాష్ట్రానికి ఎటువంటి మంచి చేయని మోదీ ఏ మొహం పెట్టుకొని మాటిమాటికి ప్రచారానికి వస్తున్నారని వైయస్ షర్మిల ప్రశ్నించారు.

తిరుమల సాక్షిగా మాటిచ్చి మోసం చేశారు
రాష్ట్రానికి మోడీ చేసింది అన్యాయం కాదు అవి నేరాలు, పాపాలు అన్నారు. అందుకే ఆయన మీద కాంగ్రెస్ పార్టీ ఈరోజు చార్జిషీట్ విడుదల చేస్తుందని దమ్ముంటే, ఆత్మ సాక్షిగా 6 కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పండి మోదీ గారు అంటూ పేర్కొన్నారు. తిరుమల సాక్షిగా మాటిచ్చి మోసం చేసినందుకు మా రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్ వినండి.

ప్రజల తరపున చార్జ్ షీట్
మీరు నేరస్తులు అందుకే పదేళ్ల మీ పాలనపై ఆంధ్రకు జరిగిన పది అన్యాయాలకు ఈ చార్జిషీట్ ను ప్రజల తరఫున తీసుకు వస్తున్నాం అంటూ పేర్కొన్నారు. ఇక ఈ చార్జిషీట్లో నాడు పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా అని, ఆ తర్వాత మాట మరిచి రాష్ట్రాన్ని వెన్నుపోటు పొడిచారు అన్నారు. జగన్ రివర్స్ టెండరింగ్ అడ్డుకోకుండా పోలవరం ప్రాజెక్టు వినాశనానికి నాంది పలికారని ఎత్తు తగ్గించే కుట్రలు కూడా చేస్తున్నారన్నారు.

విభజన హామీలు తుంగలో తొక్కారు
మీ చేతుల మీదుగా భూమి పూజ జరిపించుకున్న అమరావతి రాజధాని పదేళ్ల తర్వాత కూడా పూర్తి కాలేదన్నారు. పోరాటాలు, ప్రాణార్పణల తర్వాత సాకారమైన విశాఖ ఉక్కును అక్కడి సెంటిమెంటుకు విరుద్ధంగా అమ్మేద్దాం అని చూస్తూ మళ్లీ విశాఖ మీద దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారు అన్నారు. కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ వంటివి విభజన చట్టంలో కాంగ్రెస్ ఇచ్చిన అనేక హామీలను తుంగలో తొక్కి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశారన్నారు.

అక్కడ కేజ్రీవాల్ అరెస్ట్.. ఇక్కడ చర్యలేవీ
మీ దత్తపుత్రుడు మద్యం సిండికేట్ నడుపుతూ కల్తీ మద్యంతో మనుషుల ప్రాణాలు తీస్తున్నా మీరు ఉలకలేదు పలకలేదని, ఢిల్లీలో కేజ్రీవాల్ ను అరెస్టు చేశారు ఇక్కడ మాత్రం ఎటువంటి చర్యలు లేవు ఎందుకని ప్రశ్నించారు. దేశంలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు అంతం చేయడానికి పూనుకున్నారని, రాష్ట్రంలో దళితులపై దాడులు అత్యాచారాలు జరుగుతున్న, మీ కమిషన్లకు ఫిర్యాదులు చేస్తున్న, మీరు రాష్ట్ర సర్కారును ప్రశ్నించలేదు చర్యలకు ఉపక్రమించలేదన్నారు.

అవినాష్ రెడ్డిని అరెస్ట్ ఎందుకు చెయ్యలేదు
ఇసుక, మద్యం, ఖనిజాలు, అక్రమ కాంట్రాక్టులు, దొంగ దారిలో రాష్ట్రం చేస్తున్న అప్పులు ఇలా రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతున్న కేంద్రం నుంచి ఎటువంటి చర్యలు లేవన్నారు. కర్నూలులో అవినాష్ రెడ్డి ని అరెస్ట్ చేయడానికి సిబీఐ వచ్చి చేతకాక శాంతిభద్రతల సమస్యలు అంటూ వెనుతిరిగి పోయిందని, ఈ విషయంలో మీ సర్కారు మిన్నకుండా కూర్చోవడం యావత్ దేశానికే అవమానం అన్నారు.

మీరు దోషే.. క్షమాపణ చెప్పండి
దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మాటిచ్చి, మాట తప్పి, దేశ యువతను, నిరుద్యోగులను ఘోరంగా మోసం చేశారన్నారు. మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల మన్ కీ బాత్ లో మీరు కచ్చితంగా దోషే.. ఈ గడ్డమీద అడుగుపెట్టిన ప్రతీసారి ఇక్కడ ప్రజలను క్షమాపణ కోరండి అంటూ వైయస్ షర్మిల చార్జిషీట్ విడుదల చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+