అరకు ఎంపీ కొత్తపల్లి గీత పీఏ, బంధువు పైన చీటింగ్ కేసు
విశాఖ: ఏపీలోని అరకు పార్లమెంటు సభ్యురాలు గొత్త పల్లి గీత పీఏ ప్రదీప్ కుమార్, బంధువు విజయ్ కుమార్‌ల పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసి కులం పేరుతో దూషించారని సాగర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో, వారి పైన సెక్షన్ 420, 506 ప్రకారం ఎంపీ పీఏ, ఆయన బంధువు పైన పోలీసులు కేసు నమోదు చేశారు.

విశాఖ ఫోర్త్ టౌన్ ఇన్స్‌పెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
విశాఖ నగరంలోని ఫోర్త్ టౌన్ ఇన్స్‌పెక్టర్ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం నాడు సోదాలు నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. బాలకృష్ణ బంధువుల ఇళ్లలోను సోదాలు నిర్వహిస్తున్నారు.
దాడులకు పాల్పడిన వారిని ఉపేక్షించం: అయ్యన్న
నాటు తుపాకీ కాల్పుల్లో గాయపడి విశాఖపట్నంలో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టిడిపి నాయకుడు గేదెల సత్యనారాయణను మంగళవారం రాత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు పరామర్శించారు.
ఆసుపత్రికి వెళ్లి సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. తామంతా వెంట ఉన్నామని, అధైర్య పడవద్దన్నారు. తమ పార్టీ నాయకులపై దాడులకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నిందితులను వెంటనే పట్టుకునేలా పోలీసులకు ఆదేశఆలిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications