వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్:టిడిపి ఎమ్మెల్సీపై ఛీటింగ్ కేసు నమోదు

|
Google Oneindia TeluguNews

కాకినాడ:ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలి కాలంలో టిడిపి నేతలు వరుసగా కేసుల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా టిడిపికి చెందిన మరో ప్రజాప్రతినిధి ఛీటింగ్ కేసులో ఇరుక్కోవడం సంచలనం సృష్టించింది. పైగా ఇలా ఛీటింగ్ కేసులో ఇరుక్కున్నది మహిళా నేత కావడం గమనార్హం.

అధికారం లభించాగానే దాన్ని అవినీతికి అవకాశంగా వాడుకోవడం నేటి ప్రజాప్రతినిధుల్లో ఎక్కువమందికి పరిపాటిగా మారింది. అయితే ఎప్పుడో ఒకప్పుడు తమ అక్రమాలు బట్టబయలవుతాయన్నభయమే లేకుండా అవినీతికి,మోసాలకు పాల్పడటం...ఆ తరువాత చట్టానికి దొరికిపోయి కేసుల్లో ఇరుక్కోవడం ఇలాంటి నేతలకు సర్వసాధారణమైపోయింది. తాజాగా ఇదే కోవలో టిడిపి మహిళా ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారితో పాటు మరో పదిమందిపై ఛీటింగ్ కేసు నమోదైంది.

Cheating case filed on TDP MLC

కాకినాడకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారి 2012-2013 ఆర్ధిక సంవత్సరంలో స్త్రీ నిధి పథకానికి చెందిన రూ.26.3 లక్షల నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారి తో పాటు మరో పదిమందిపై కూడా కేసు నమోదు చేశారు. వీరందరిపై కోటనందూరు పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 409, 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
English summary
A police case was registered against another TDP leader.Filing a cheating case against Kakinada's TDP MLC Laxmi Siva kumari created sensation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X