ముద్రగడ స్ధానంలోకి హరిరామజోగయ్య.. ! చంద్రబాబు ప్లేస్ లో వైఎస్ జగన్.. ?

ఏపీలో గతంలో సాగిన కాపు రిజర్వేషన్ల పోరులో కీలక పాత్ర పోషించిన ముద్రగడ పద్మనాభం స్ధానంలో ఇప్పుడు మరో మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య వచ్చినట్లు కనిపిస్తోంది.

ఏపీలో కాపు రిజర్వేషన్ల కోసం దశాబ్దాల క్రితమే డిమాండ్లు మొదలయ్యాయి. అప్పట్లో ఇవే డిమాండ్లతో పలువురు కాపు నేతలు మంత్రి పదవులు కూడా తెచ్చుకున్నారు. ఆ తర్వాత కూడా కాపులకు రిజర్వేషన్లు మాత్రం రాలేదు. దీంతో కాపు రిజర్వేషన్ల డిమాండ్ నెత్తికెత్తుకునే నేతల్ని ఆయా సామాజిక వర్గం జనం కూడా నమ్మడం మానేశారు. కానీ అరకొరగా అయినా ఇప్పటికీ రిజర్వేషన్ల కోసం కోసం పోరాడుతున్న వారిపై మాత్రం కాస్త సానుభూతి కనిపిస్తోంది. దీంతో ఒకప్పుడు చంద్రబాబు పాలనలో ఉద్యమించిన స్దానంలో ఇప్పుడు చేగొండి హరిరామజోగయ్య కనిపిస్తున్నారు.

 కాపు రిజర్వేషన్ల పోరు

కాపు రిజర్వేషన్ల పోరు

కాపులకు బీసీల్లో చేర్చి 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ డిమాండ్ కు మద్దతు పలుకుతూ అధికారంలోకి వచ్చిన గత చంద్రబాబు ప్రభుత్వం ఆ తర్వాత దాన్ని పట్టించుకోకపోవడంతో కాపులు ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో ఉద్యమించారు.

అయితే ఆ ఉద్యమాన్ని తొలుత లైట్ తీసుకుని, ఆ తర్వాత సీరియస్ అయి చివరకు అణచివేసేందుకు ప్రయత్నించిన చంద్రబాబు ప్రభుత్వం భంగపడింది. అయితే ఈ ఉద్యమం కారణంగా కేంద్రం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ కోటాలో నుంచి ఐదుశాతం రిజర్వేషన్లను కాపులకు ఇచ్చి చంద్రబాబు ఊరటనిచ్చారు.

దీంతో వివాదం కాస్త సద్దుమణిగింది. ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో మరోసారి కాపు రిజర్వేషన్ల డిమాండ్ తెరపైకి వచ్చింది. అదీ ఎన్నికల ముందు కావడంతో జగన్, చంద్రబాబు ఇద్దరికీ ఇబ్బందులు తప్పేలా లేవు.

ముద్రగడ స్ధానంలోకి చేగొండి హరిరామజోగయ్య ?

ముద్రగడ స్ధానంలోకి చేగొండి హరిరామజోగయ్య ?

కాపు రిజర్వేషన్ల పోరాటం అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు ముద్రగడ పద్మనాభం. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చంద్రబాబు హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం భారీ పోరాటమే చేశారు. 2016లో తునిలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ దగ్ధం చేసే వరకూ వెళ్లి కాపు రిజర్వేషన్ల పోరు ముద్రగడకు భారీ మైలేజ్ తో పాటు చిక్కులు కూడా తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఆయన స్ధానంలో కాపు రిజర్వేషన్ల కోసం మరో మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య పోరాడుతున్నారు. ఓవైపు వృథ్యాప్యం వెంటాడుతున్నా నిరాహారదీక్ష కూడా చేసిన జోగయ్య ఇప్పుడు కాపు ఉద్యమ పోరు రగిల్చే పనిలో ఉన్నారు. దీనికి తెరవెనుక పవన్ కళ్యాణ్ వంటి వారి మద్దతు కూడా ఉండటంతో ప్రభుత్వం పునరాలోచనలో పడుతోంది.

చంద్రబాబు స్ధానంలో జగన్ ?

చంద్రబాబు స్ధానంలో జగన్ ?

కాపు రిజర్వేషన్లపై హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో దాన్ని నెరవేర్చేందుకు మంజునాథ కమిషన్ వేయడం, దాని నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేయడం చేసారు. అయితే ఇవి కాస్తా ఆలస్యం కావడంతో తుని రైలు ఘటన వంటివి చోటు చేసుకున్నాయి.

ఎట్టకేలకు ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు వాటా ఇచ్చి చంద్రబాబు మమా అనిపించారు. దీన్ని అప్పట్లో విమర్శించిన వైసీపీ .. ఇఫ్పుడు తాము అధికారంలో ఉన్నా కనీసం ఆ నిర్ణయాన్ని సైతం అమలు చేయలేకపోతోంది. దీంతో హరిరామజోగయ్య రూపంలో వైఎస్ జగన్ ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్ధితి.

ప్రస్తుతానికి కాపు మంత్రులతో జోగయ్యను కౌంటర్ చేస్తున్నా రాబోయే రోజుల్లో కాపు రిజర్వేషన్ల డిమాండ్లు పెరిగితే మాత్రం జగన్ సర్కార్ కూ ఇబ్బందులు తప్పకపోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+