జగన్‌కు సవాల్ విసిరేంత మగాడివా? నీకంటే సీమలో పంది నయం: జేసీపై చెవిరెడ్డి సంచలనం

తెలుగుదేశం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

విజయవాడ: తెలుగుదేశం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సోమవారం చెవిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలతో జేసీపై విరుచుకుపడ్డారు.

'నువ్వు మనిషి రూపంలో ఉన్న మృగానివి, రాయలసీమ రెడ్డిగా ఎలా పుట్టావు? నువ్వు రెడ్డివో కాదో డీఎన్ఏ పరీక్ష చేసి తేల్చాలి. నీ కంటే రాయలసీమలో పందులు నయం. ఏంది రా.. నీ సవాల్‌, జగన్‌‌పై సవాల్‌ విసిరేంత మగాడివా? పరిటాల రవికి దడిచి పారిపోతే అండగా నిలిచిన వైయస్సార్ కుటుంబాన్ని నోటికొచ్చినట్టుగా తిడతావా?' అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్, ఆయన తల్లి విజయలక్ష్మిపై జేసీ చేసిన విమర్శలను ఖండించారు.

టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి అర్థమయ్యే ఏకైక భాష బూతు భాష అని, అందులో చెబితేనే ఆయనకు అర్థమవుతుందని మండిపడ్డారు. ఆయన భాషలో సమాధానం చెప్పాలంటే తాము కూడా దిగజారాలన్నారు.

Chevireddy Bhaskar Reddy lashes out at JC Prabhakar Reddy

చంద్రబాబుపై తీవ్రంగా ధ్వజమెత్తిన చెవిరెడ్డి

చంద్రబాబు నాయుడి ప్రభుత్వం రాసిచ్చిన పచ్చి అబద్ధాలు చదవలేక.. పెద్దాయన గవర్నర్ చాలా ఇబ్బందులు పడ్డారని చెవిరెడ్డి భాస్కర రెడ్డి అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని రాష్ట్రం యావత్తు చూసిందని, చంద్రబాబు రాసి ఇచ్చిన అవాస్తవాలు, అబద్ధాలు చెప్పలేక ఆ పెద్దాయన పడిన ఇబ్బందులు, అవస్థలు, ఆపసోపాలు మా కళ్లతో అసెంబ్లీలో చూశామని అన్నారు.

ఇన్ని అబద్ధాలు చదవలేనంటూ నాలుగైదు సార్లు నీళ్లు తాగారని, దాన్నిబట్టే ఆయన మానసికంగా ఎంత నలిగిపోయారో కనిపించిందని చెప్పారు. తొలి సంతకంతో రైతుల రుణమాఫీ అన్నారు, ఎక్కడా కనిపించడంలేదని, ఇంటికో ఉద్యోగం ఎక్కడికెళ్లిపోయిందో తెలియదని చెప్పారు. అయితే.. ఒక్క ఇంట్లోనే ముగ్గురు బాబులకు ఉద్యోగం ఇప్పించిన ఘనత చంద్రబాబుదేనని చెవిరెడ్డి ఎద్దేవా చేశారు.

పెద్దబాబు చంద్రబాబు, మధ్యబాబు బాలయ్య, చిన్నబాబు లోకేష్ ముగ్గురికీ పదవులు ఇచ్చారని, ఇక ఆ కుటుంబంలో మిగిలింది బుల్లిబాబు దేవాన్ష్ ఒక్కడేనని అన్నారు. ఒక కేసు లోంచి బయటపడేందుకు పదేళ్లు హక్కున్న రాజధాని నుంచి వచ్చేశారని, ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని, ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+