ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని...: టిడిపిపై చెవిరెడ్డి

Chevireddy Bhaskar Reddy retaliates TDP
తిరుపతి: ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో తమ పార్టీ కార్యకర్త విజయానంద రెడ్డిని తాను కలవడాన్ని ఎల్లో మీడియా చిలువలు పలువలుగా వక్రీకరించిందని ఆయన మండిపడ్డారు.

విజయానంద రెడ్డిని కలవడాన్ని తాను నూటికి నూరు శాతం సమర్థించుకంటున్నానని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఆపదలో ఉంటే కలుసుకుంటానని, వారు ఏ జైలులో ఉన్నా కలిసేందుకు వెనుకాడే ప్రసక్తి లేదని ఆయన అన్నారు.

కడప జిల్లాలో ఎర్రచందన స్మగ్లర్లు రెడ్డి నారాయణ, మహేష్ నాయుడులు పీడీ యాక్టు కింద గతంలో అరెస్టయ్యారని ఆయన గుర్తు చేశారు. వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బీ ఫారాలు ఇచ్చారని ఆయన అన్నారు.

ఎర్రచందనం స్మగ్లర్లకు బీ ఫారాలు ఇచ్చిన చంద్రబాబుకు ఎర్రచందనం స్మిగ్లంగ్‌తో సంబంధం ఉన్నట్లేనా అని ఆయన అడిగారు. తమ పార్టీ కార్యకర్తలను అంతమొందించాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+