చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడికి కీలక పదవి..!!
తిరుపతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి జిల్లా చంద్రగిరి శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడ చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి కీలక పదవి లభించింది. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మెన్‌గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తుడా ఛైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించిన తేదీ నుంచి మూడు సంవత్సరాల పాటు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆ పదవిలో కొనసాగుతారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి.. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. తుడా ఛైర్మన్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో ఎక్స్‌అఫీషియోగా సభ్యత్వం ఉంటుంది.

వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా పేరుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి. ఆవిర్భావం నుంచీ పార్టీలో కొనసాగుతూ వస్తోన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకస్తుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు.
వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాస్కర్ రెడ్డి పోటీ చేయకపోవచ్చని తెలుస్తోంది. ఆయన స్థానంలో మోహిత్ రెడ్డికి టికెట్ దక్కడం దాదాపుగా ఖరారైంది. ప్రస్తుతం మోహిత్ రెడ్డి.. తిరుపతి రూరల్ ఎంపీపీగా ఉన్నారు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలను ఆయనే పర్యవేక్షిస్తోన్నారు.
గడప గడపకు కార్యక్రమంలో మోహిత్ రెడ్డి పాల్గొనడం పట్ల ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఏ అధికారంతో ఆయన ఈ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటోన్నారంటూ నియోజకవర్గ టీడీపీ నాయకులు ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. తుడా ఛైర్మన్‌గా అపాయింట్ కావడంతో.. ఆ విమర్శలకు ప్రభుత్వం చెక్ పెట్టినట్టయింది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications