నారా లోకేష్ కోసమే పట్టిసీమ: జగన్ పార్టీ నేత

తిరుపతి: పట్టిసీమ ప్రాజెక్టు కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి తనయుడు నారా లోకేష్ లబ్ధి కోసమేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాజెక్టుతో గోదావరి డెల్టాలు సర్వనాశనం అవుతాయని ఆయన అన్నారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వాడవాడలా వైఎస్ఆర్ విగ్రహాలు వెలుస్తాయని, అందుకే చంద్రబాబు కుట్ర చేస్తున్నారని చెవిరెడ్డి ఆరోపించారు. బస్సు యాత్ర ద్వారా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో చంద్రబాబు మోసాలను ఎండగడతామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును అటకెక్కించడం కోసమే చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టారని ఆయన అన్నారు.

Chevireddy says Pattiseema is to benfit Lokesh

రాయలసీమపై చంద్రబాబుది కపట ప్రేమ అని, చిత్తశుద్ధి ఉంటే గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన పట్టిసీమ ప్రాజెక్టును వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో పాటు కాంగ్రెసు పార్టీ కూడా వ్యతిరేకిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+