పచ్చ చొక్కాలు వేసుకున్నట్లుగా, ఏం చేసినా జగన్ అండగా ఉన్నారు: చెవిరెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల పైన ఈ ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెడుతోందని, ప్రభుత్వం పెట్టే కేసులకు తాము భయపడే ప్రసక్తి లేదని, తమ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారని వైసిపి నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి బుధవారం అన్నారు.

ఆయన తూర్పు గోదావరి జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం వెంటాడి మరీ కాపుల పైన కేసులు పెడుతోందని ఆరోపించారు. పోలీసు వ్యవస్థను టిడిపి నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకున్న వాళ్లలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

YSRCP leader Chevireddy Bhaskar Reddy takes on AP CM Chandrababu Naidu.

వెలగపూడి నుంచి చంద్రబాబు పాలన షురూ

భవిష్యత్‌ రాజధాని నిర్మాణానికి సచివాలయమే కేంద్రస్థానమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరులోని వెలగపూడిలో నిర్మించిన సచివాలయం నుంచి ఆయన బుధవారం పాలన ప్రారంభించారు.

ఈ సందర్భంగా సచివాలయానికి చేరుకున్న ఆయనకు ఉద్యోగులు, అధికారులు ఘనస్వాగతం పలికారు.
ఈ అనంతరం చంద్రబాబు మాట్లాడారు. అందరం కలిసి అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మించుకుందామన్నారు.

అనేక ఇబ్బందుల మధ్య అమరావతికి రావాల్సి వచ్చిందని.. ఉద్యోగులూ ఎన్నో త్యాగాలు చేసి ఇక్కడికి వచ్చారన్నారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాను చూసుకుంటానని.. ప్రజలకు ఇబ్బందలు లేకుండా ఉద్యోగులు చూసుకోవాలని సూచించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP leader Chevireddy Bhaskar Reddy takes on AP CM Chandrababu Naidu.
Please Wait while comments are loading...