కరోనాపై పోరు : కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం ప్రకటించిన కేసీఆర్,జగన్
కరోనాపై పోరులో మరోసారి దేశ ఐక్యతను చాటేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు యావత్ భారతం దీప కాంతులు,ఫ్లాష్ లైట్స్‌తో వెలిగిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రి 9 గంటలకు ప్రగతిభవన్‌లో దీపాలు వెలిగించి సంఘీభావం ప్రకటించారు. కేసీఆర్‌తో పాటు ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు కూడా ప్రగతి భవన్‌లో కొవ్వొత్తులు వెలిగించారు.గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కుటుంబసభ్యులతో కలిసి రాజ్‌భవన్‌లో కొవ్వొత్తులు వెలిగించారు. ఇక రాష్ట్ర మంత్రులు,ఎమ్మెల్యేలంతా తమ తమ నివాసాల్లో దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారు.
Recommended Video
అటు ఏపీలో ముఖ్యమంత్రి జగన్ కూడా తాడేపల్లిలోని తన నివాసంలో కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం ప్రకటించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ కొవ్వొత్తులు వెలిగించారు. ఇరు రాష్ట్రాల్లోనూ ప్రజలంతా తమ ఇళ్ల ముందు,బాల్కనీల్లో దీపాలు వెలిగించి మరోసారి ఐక్యతను,సంఘీభావాన్ని చాటిచెప్పారు.













Click it and Unblock the Notifications