చంద్రబాబు అసెంబ్లీకి రావాలి - అమరావతి పై సభలో : చీఫ్ విప్..!!

అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందే ఏపీలో రాజకీయంగా సవాళ్లు మొదలయ్యాయి. ఈ సారి సమావేశాల్లో ప్రభుత్వం - ప్రతిపక్షం కొత్త వ్యూహాలతో వ్యవహరించేందుకు సిద్దం అవుతున్నాయి. అందులో భాగంగా ప్రభుత్వం నుంచి కీలక అంశాల పైన చర్చ..స్పష్టత ఇచ్చేందుకు అధికార పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. పాలన వికేంద్రీకరణ, పరిపాలన సంస్కరణలపై చట్టసభలు వేదికగా విస్తృత చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతోంది.

దీంతో పాటుగా ప్రభుత్వం పైన ప్రతిపక్షాల విమర్శలకు సభా వేదికగా సమాధానం చెప్పేందుకు సమాయత్తం అవుతోంది. అందులో బాగంగా అప్పులు, పెట్టుబడులు, వృద్ధి రేటు, ఇసుక, పోలవరం, మద్యం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, మహిళా సాధికారితపై చర్చకు సిద్దమని చెబుతోంది. ఇక.. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తామ‌ని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ప్రసాద్‌రాజు వెల్లడించారు. ఇదే సమయంలో ప్రసాద రాజు ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఈ సారి అసెంబ్లీ స‌మావేశాల‌కు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలు రావాల‌ని ఆహ్వానించారు. అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనేది అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటుంద‌న్నారు.

Chief Whip Prasada Raju Asked Chandra Babu to Attend the House,says govt preapred for discussions

రేపు ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభం అవుతాయి.. జీరో అవ‌ర్ తర్వాత బీఏసీలో అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రతిపక్షం లేవనెత్తే ప్రతి అంశంపై సమాధానం చెప్పటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మూడు రాజధానుల విషయంలో గత అసెంబ్లీ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ చాలా స్పష్టంగా చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.. అవసరమైతే మూడు రాజధానుల బిల్లు సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందన్న ఆయన.. ఎప్పుడు ప్రవేశపెడతారు అనేది ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రజలకు మేలు చేసే విధంగా బిల్లులు ఉంటాయ‌ని చీఫ్‌ విప్‌ ప్రసాద్‌రాజు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+