గొడవ చేస్తోందని పాపను ఆల్మారాలో బంధించిన ఆయా

భవాని అల్లరి చేస్తుండడంతో ఆయా మంగళి శ్యామల చెక్క అల్మారాలో బంధించింది. ఇంతలో అటువైపు నుండి వెళ్తున్న ఆ బాలిక తండ్రి సత్యం కూతురు ఏడ్పులు విని అక్కడికి చేరుకున్నాడు. పాప కనిపించకపోవడంతో ఆయాను నిలదీశాడు.
అప్పుడు ఆయా దుర్గా భవాని ఏడుస్తోందని అందులో ఉంచితే ఏడుపు మానేస్తుందని చెప్పి అల్మారాలో నుండి బయటకు తీసింది. అప్పటికే భయంతో ఉన్న దుర్గ్భావాని మరింత భయపడడంతో తీవ్ర జ్వరం వచ్చింది.
కోపోద్రిక్తులైన గ్రామస్థులు, బాలిక తల్లిదండ్రులు ఆయా చర్యలపై ఐసిడిఎస్ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఐసిడిఎస్ సిడిపివో జ్యోతిర్మయి జరిగిన ఘటనపై విచారణ జరిపారు.












Click it and Unblock the Notifications