చైనా వల్లే ప్రపంచానికి చేటు.. థర్డ్ స్టేజికి వెళ్ళినా పోరాడతాం : ఏపీ మంత్రి మేకపాటి
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ ఏపీ మంత్రి ఏపీలో తాజా పరిస్థితిపై , అలాగే కరోనా ఇంతగా ప్రబలటానికి గల కారణాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనా దేశం కరోనాకి సంబంధించిన వాస్తవాలని మొదట్లో దాచిపెట్టడం వల్లనే ప్రపంచానికి చేటైందని ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక ఏపీలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తుందని చెప్పారు.

ఏపీలో కరోనా సెకండ్ స్టేజ్ .. థర్డ్ స్టేజ్ లో ఉన్నా ఎదుర్కొంటాం అన్న మంత్రి
ఏపీలో కరోనా సెకండ్ స్టేజీలో ఉందన్న ఆయన థర్డ్ స్టేజీకి వెళ్లినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇక కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు . ప్రజల సహకారం కూడా కావాలని కోరారు. ప్రజలు కొందరు మానసిక స్థైర్యం కోల్పోయే ప్రమాదం ఉన్నందున, అటువంటి వారిని కూడా ట్రాక్ చేస్తున్నామన్నారు. అలాంటి వారికి మానసిక స్థైర్యం కలిగిస్తామని చెప్పారు. నిరుపేదల కోసం ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని పేర్కొన్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్ని వర్గాల వారిని ఈ విపత్తు సమయంలో ఆదుకోటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు.

రైతులకు భరోసా ఇచ్చిన మేకపాటి
ఇక రైతులు దిగులు పడాల్సిన అవసరం లేదని , ధాన్యం, ఇతర పంటలని కొనుగోలు చేయమని కలెక్టర్లని గతంలో ఆదేశించడం జరిగిందని చెప్పారు . ప్రస్తుత నేపథ్యంలో రైతులకి నష్టం రాకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు . ఇక ప్రజల ఆరోగ్య రక్షణ కోసం నిత్యవసర సరుకులు కోసం ఒక్కసారిగా ప్రజలు బయటకి రాకుండా డోర్ డెలవరీ సౌకర్యం కల్పించామని కూడా ఆయన పేర్కొన్నారు .

రాష్ట్రంలోకి ఎవరినీ అనుమతించం
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యవసరాలకి ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు మేకపాటి . ప్రజలు కూడా సహకరించాలని పిలుపునిచ్చారు . ఏపీ నుంచి ఇతర ప్రాంతాలకి వెళ్లిన వారిని రాష్ట్రంలోకి అనుమతివ్వమని ఆయన పేర్కొన్నారు . ఇతర రాష్ట్రాల వారు ఏపీ మీదుగా ఇతర రాష్ట్రాలకి వెళ్లేందుకు కూడా అనుమతివ్వలేమని ఆయన చెప్పారు . అలాంటి వారికి కొదొఆ సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు . లాక్ డౌన్ విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది, జర్నలిస్టులకి సేఫ్టీ కిట్స్ అందిస్తామని చెప్పారు మేకపాటి .
-
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications