జగన్ ను కలిసిన చినజీయర్ స్వామి-రామానుజుడి సహస్రాబ్ది ఉత్సవాలకు ఆహ్వానం

ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ఇవాళ త్రిదండి చిన్న జీయర్ స్వామి కలిశారు. హైదరాబాద్ శివార్లలో ఆశ్రమం నిర్వహిస్తున్న చిన్న జీయర్ సుదీర్ఘ విరామం తర్వాత ఇవాళ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఓ ప్రత్యేక ఆహ్వానం ఇచ్చేందుకు జగన్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్బంగా జగన్ ఆయనకు పాదాభివందనం చేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు.

గుంటూురు జిల్లా తాడేపల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను త్రిదండి చినజీయర్‌ స్వామి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చింతల్‌ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని సీఎం వైఎస్‌ జగన్‌ను త్రిదండి చినజీయర్‌ స్వామి ఆహ్వనించారు. ఈ సందర్భఁగా జగన్ కు తన ఆశీస్సులు కూడా అందజేశారు.

chinna jeeyar swamy met ap cm ys jagan, invite for ramanujacharyas millenium celebrations

వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వ తేదీ వరకు హైదరాబాద్ లోని ముచ్చింతల్ ఆశ్రమంలో రామాముజుడి సహస్రాబ్ది ఉత్సవాల నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 1035 కుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరగనున్నాయి. వీటిలో పాలుపంచుకోవాలని త్రిదండి చిన్న జీయర్ స్వామి జగన్ ను కోరారు. జగన్ తో భేటీలో చినజీయర్‌ స్వామితో పాటు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మై హోం గ్రూప్‌ చైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు కూడా పాల్గొన్నారు.

chinna jeeyar swamy met ap cm ys jagan, invite for ramanujacharyas millenium celebrations

చిన్నజీయర్ భక్తుడైన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయన నిర్వహించే కార్యక్రమాలకు తరచుగా హాజరవుతుంటారు. ఏపీ సీఎం జగన్ మాత్రం విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద వద్దకు వెళ్తుంటారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ ఆశ్రమంలో కార్యక్రమానికి జగన్ ను ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఓసారి కేసీఆర్ నిర్వహించిన యాగం సందర్భంగా చిన్నజీయర్ కలిశారు. ఈసారి రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలకు జగన్ వెళితే అక్కడ తెలంగాణ సీఎం కేసీఆర్ కలిసే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+