విజయవాడ వెళ్తాం: చినరాజప్ప, ర్యాగింగ్‌పైనా, జీగ్రూప్ చైర్మన్‌తో బాబు
హైదరాబాద్: ర్యాగింగ్ జరగకుండా విశ్వవిద్యాలయాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తామని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప బుధవారం చెప్పారు. త్వరలో పోలీసు శాఖలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. 14వేల ఖాళీల్లో 7వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు.
హోంగార్డుల జీతాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. విజయవాడలో వారంలో మూడు రోజుల పాటు భద్రత పైన డిజిపి పర్యవేక్షిస్తారని చెప్పారు. త్వరలో అన్ని శాఖలు విజయవాడకు తరలిస్తామని చెప్పారు. మంత్రుల, ఉద్యోగుల నివాస సముదాయాల కోసం భవనాల అన్వేషణ జరుగుతోందన్నారు.
నీటి కష్టాలు తీరుస్తాం: మంత్రి నారాయణ

నెల్లూకు, కర్నూలు జిల్లాల ప్రజల నీటి కష్టాలను తీరుస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. కండలేరు నుంచి డెడ్ స్టోరేజి నుంచి 1.5 టిఎంసీల వరకు నీటిని విడుదల చేస్తామన్నారు. కాగా, బిజెపి-టిడిపిల మధ్య దూరం పెంచేందుకు కాంగ్రెస్, వైసిపిలు కుట్ర చేస్తున్నాయని మంత్రి కామినేని శ్రీనివాస రావు విమర్శించారు. ఏపీకి తప్పకుండా ప్రత్యేక హోదా వస్తుందన్నారు.
రెండు నెలల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ: పరిటాల సునీత
రెండు నెలల్లో రాష్ట్రంలో ఎనిమిది లక్షల కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని మంత్రి పరిటాల సునీత చెప్పారు. పార్టీలకు అతీతంగా దీపం కనెక్షన్లను మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వం నూతనంగా చేపట్టిన మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జీ గ్రూప్ చైర్మన్‌తో చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్రతో బుధవారం నాడు భేటీ అయ్యారు. కొత్త రాజధాని గురించిన విశేషాలను ఆయనకు తెలిపారు.












Click it and Unblock the Notifications