ఎవరైనా బలికావచ్చు.. జగన్ ఫ్యామిలీకి చింతమనేని షాకింగ్ సలహా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి ఘటనపై ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇది టీడీపీ చేసిన పనేనని వైసీపీ ఆరోపిస్తుంటే, సానుభూతి కోసం జగన్ ఆడుతున్న డ్రామా అని టీడీపీ శ్రేణులు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.
ఎవరైనా బలికావచ్చు
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ ఘటనపై సీఎం జగన్, మరియు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికలలో బాబాయ్ గొడ్డలి పోటుతో సానుభూతి పెంచుకున్నారని, ఇప్పుడు గులకరాయి డ్రామా విఫలమైందని, ఇక ప్రజల్లో సానుభూతి కోసం ఎవరైనా బలి కావచ్చని చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలు చేశారు.

విజయమ్మ అమెరికా వెళ్ళిన కారణమిదే
వైఎస్ విజయమ్మ ముందు జాగ్రత్తగా అమెరికా వెళ్లారని ప్రజలు అనుకుంటున్నారని చింతమనేని పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో జగన్ నటిస్తున్నారని చింతమనేని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పై రాయి దాడి నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని చింతమనేని ప్రభాకర్ సూచించారు. వైయస్ భాస్కర్ రెడ్డి కూడా జైల్లోనే ఉంటా బయటకు రాను అంటున్నారని చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు.
జగన్ గులకరాయి నాటకం అందుకే
ఇక టిడిపి నేత వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు జగన్ పై రాయి దాడి ఘటనపై స్పందించారు. సిట్ కార్యాలయంలో డాక్యుమెంట్ల ధ్వంసం ఘటన నుంచి దృష్టి మరల్చడానికి జగన్ గులకరాయి నాటకం ఆడారు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఎన్ని నాటకాలు ఆడినా జగన్ ఓటమి నుంచి, కేసుల నుంచి జగన్ తప్పించుకోలేరని జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు.
సానుభూతి కోసం ఇంతలా
అంతేకాదు స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల ఆధారాలను కూల్చేశారని, టిడిపి అధికారంలోకి వస్తే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతోనే డాక్యుమెంట్లను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఇక వీటితో పాటు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు కూడా వీరికి చుట్టుకోబోతుందని అందుకే సానుభూతి కోసం డ్రామాలు ఆడుతున్నారని జీవీ ఆంజనేయులు విమర్శించారు.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications