టిడిపి అనుబంధ ఎమ్మెల్యే గుడ్ బై : వైసిపిలోకి చీరాల ఎమ్మెల్యే : 13న ఆమంచి చేరిక..!
టిడిపి అనుబంధ ఎమ్మెల్యే వైసిపి లో చేరుతున్నారు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన ఆమంచి కృష్ణ మోహన్ గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా గెలిచారు. అనంతరం టీడీపీకి అనుబంధంగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆమంచి ని పార్టీలోకి రావాలని వైసిపి తో పాటుగా జనసేన సైతం ఆహ్వానించింది. అయితే, కార్యకర్తలతో సమావేశం తరువాత ఆయన వైసిపి చేరాలని నిర్ణయించారు.

2014 లో స్వతంత్ర అభ్యర్ధిగా..
2009 లో కాంగ్రెస్ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలి సారి అసెంబ్లీ కి ఎన్నికయ్యారు ఆమంచి కృష్ణ మోహన్. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కు సన్నిహితుడిగా ఉండే వారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన పరిస్థితుల్లో ఆయన కాం గ్రెస్ నుండి కాకుండా నవోదయా పార్టీ పేరుతో స్వతంత్రంగా పోటీ చేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో అక్కడి టిడిపి నుండి పోటీ చేసిన పోతుల సునీత రెండో స్థానంలో ఉండగా, వైసిపి నుండి పోటీ చేసిన బాలాజీ మూడో స్థానంలో నిలి చారు. ఇక, 2014 ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆయన టిడిపి లో చేరారు. అప్పటి నుండి టిడిపికి అనుబంధ ఎమ్మెల్యేగా కొనసాగు తున్నారు.తాజాగా, ఆయనను పార్టీలోకి రావాలంటూ వైసిపి తో సహా జనసేన నేతలు ఆహ్వానించారు. దీని అభిమాను లతో విస్తృతంగా మంతనాలు జరిపిన ఆమంచి వైసిపి వైపే మొగ్గు చూపారు.

జగన్ తో భేటీ .. 13న పార్టీలో చేరిక..
తన కార్యకర్తలు..అభిమానులతో సమావేశమైన ఆమంచి కృష్ణమోహన్ తన భవిష్యత్ కార్యాచరణ పై స్పష్టమైన నిర్ణ యానికి వచ్చారు. పార్టీ మారే యోచనతోనే ఆయన రెండు రోజులుగా జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమాలకు దూరం గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమంచి వైసిపి లో చేరిక పై కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే, తనతో పాటుగా మరో ముఖ్య నేతను పార్టీలోకి తీసుకొస్తానని ఆయనకు ఇదే జిల్లాలోని మరో సీటు ఇవ్వాలని ఆమంచి ప్రతిపాదించారు . అయితే, దీనికి జగన్ సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం.

వైసిపి లో చేరనున్నారు
దీంతో..ఆమంచి ఒక్కరే వైసిపి లో చేరనున్నారు. బుధవారం జగన్ తో సమావేశం కానున్నారు. ఈ నెల 13వ తేదీన జగన్ ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఆ రోజునే దగ్గుబాటి తో పాటుగా ఆమంచి సైతం వైసిపి లో అధికారికంగా చేరనున్నారు.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications