వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు కోరిక మేరకు 'ఆమె' తప్పుకుంది: కాంగ్రెస్ పార్టీలో చిరంజీవికి కొత్త పదవి

పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పిసిసి సభ్యుడిగా చిరంజీవి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

|
Google Oneindia TeluguNews

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పిసిసి సభ్యుడిగా చిరంజీవి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అశోక్-పితానిలపై వవన్ కళ్యాణ్ వెటకారం!అశోక్-పితానిలపై వవన్ కళ్యాణ్ వెటకారం!

చిరంజీవి స్వయంగా కోరడంతోనే ఆయనకు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు బ్లాక్ 1 నుంచి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తోందని అంటున్నారు.

 చిరంజీవి కోరిక మేరకు ఆమె అవకాశం వదులుకున్నారు

చిరంజీవి కోరిక మేరకు ఆమె అవకాశం వదులుకున్నారు

మొత్తం 17 మందిని పిసిసి సభ్యులుగా జిల్లా నుంచి ఎంపిక చేశారు. ఈ నెల 10వ తేదీన విజయవాడలో పిసిసి సర్వసభ్య సమావేశం జరగనుంది. ఆపై పిసిసి అధ్యక్ష ఎన్నిక జరగనుంది. తొలుత కొవ్వూరు బ్లాక్ 1 నుంచి పిసిసి సభ్యురాలిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మహిళా నేత అమరజహా బేష్ నియమించాలని నిర్ణయించారు. కానీ చిరంజీవి కోరిక మేరకు ఆమె తప్పుకున్నారు.

Recommended Video

Chiranjeevi leave politics soon కాంగ్రెస్‌కు చిరంజీవి షాక్ | Oneindia Telugu
 సొంత జిల్లా నుంచి కావాలని కోరుకోవడంతో

సొంత జిల్లా నుంచి కావాలని కోరుకోవడంతో

చిరంజీవి తన సొంత జిల్లా నుంచి సభ్యుడిగా ఎంపిక కావాలని ఆకాంక్షించారు. దీంతో ఏపీ పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి జిల్లా నాయకత్వానికి సమాచారం అందించారు. దీంతో అమరజహా భేష్ తన స్థానంలో చిరంజీవికి అవకాశమిస్తానని చెప్పారు.

చిరంజీవి ఎంపీకపై అందరి హర్షం

చిరంజీవి ఎంపీకపై అందరి హర్షం

దీనిపై పిసిసి జిల్లా అధ్యక్షులు రఫీ ఉల్లా బేగ్ మాట్లాడారు. చిరంజీవి నాయకత్వం పట్ల అత్యంత విశ్వాసంతో కొవ్వూరు నుంచి ఆయనను పిసిసి సభ్యుడిగా నియామకం జరిగేలా తన కోడలు అమరజహా తప్పుకున్నారని వెల్లడించారు. చిరంజీవి ఎంపికపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.

 అంతా వట్టి ప్రచారమేనా

అంతా వట్టి ప్రచారమేనా

కాగా, చిరంజీవి కాంగ్రెస్ పార్టీని వీడుతారని, రాజకీయాలకు గుడ్ బై చెబుతారని కొద్ది రోజుల క్రితం ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు ఆయనను పిసిసి సభ్యుడిగా నియమించడం, అది కూడా ఆయననే అడిగి కొవ్వూరు బ్లాక్ 1 నుంచి నియమించబడటం చూస్తుంటే.. అప్పుడు జరిగిన ప్రచారం వట్టిదేనని తెలుస్తోంది.

English summary
Congress Leader Chiranjeevi appointed as PCC member from Kovvur 1 black in West Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X