తెలంగాణ ప్రాజెక్టు కోసం చిరంజీవి, పోలవరంపై జైరాం
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు మద్దతుగా రాజ్యసభలో మాట్లాడిన కాంగ్రెసు నేత చిరంజీవి తెలంగాణ వైపు దృష్టి పెట్టారు. తనకు ప్రాంతీయ వివక్ష లేదని చెప్పుకోవడానికే అన్నట్లు ఆయన ప్రాణహిత - చేవెళ్ల కూడా జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పోలవరం ప్రాజెక్టు సాధన రైతుల విజయమని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జాతీయ హోదా కల్పించిన విషయం తెలిసిందే.
కాగా, కాంగ్రెసు సీనియర్ నేత, మాజీ మంత్రి జైరాం రమేష్ పోలవరం ప్రాజెక్టుకు మద్దతుగా నిలుస్తున్నారు. పోలవరం అర్డినెన్స్ బిల్లును రాజ్యసభలో ఆయన సమర్థించారు. ఇందుకు ఆయన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు కూడా అందుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం వెంటనే పోలవరం సంక్షేమ అథారిటీని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. కృష్ణానది నిర్వహణ బోర్డుకు పూర్తి స్థాయి చైర్మన్‌ను నియమించాలని ఆయన కోరారు. పోలవరం ప్రాజెక్టుకు అధిక నిధులు కేటాయించాలని ఆయన ిడమాండ్ చేశారు.
పోలవరం ఆర్డినెన్స్ బిల్లును సమర్థిస్తూ చిరంజీవి సోమవారం రాజ్యసభలో మాట్లాడారు. దాంతో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారనే ముద్రను దూరం చేసుకోవడానికే అన్నట్లు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు గురించి మాట్లాడారని అంటున్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించింది.












Click it and Unblock the Notifications