బావకు కుక్కల ఇంజక్షన్స్ ఇచ్చి చంపిన బావమరిది కేసులో షాకింగ్ ట్విస్ట్!

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో వ్యవసాయ అధికారి శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీహరి బావమరిది హరికృష్ణ కోసం పోలీసులు గాలింపులు చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీహరి బావమరిది హరికృష్ణ తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడినట్టు రైల్వే పోలీసులు ధ్రువీకరించారు.

బావమరిదికి ఆస్తి రాసిచ్చిన బావ.. తిరిగి ఇచ్చేందుకు నిరాకరణ

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో వ్యవసాయ అధికారి అయిన శ్రీహరి తాము సంపాదించిన కోట్ల ఆస్తులను కుటుంబ సభ్యుల పేరుతో రాశారు. అందులో భాగంగా హరికృష్ణ పేరుపైన కూడా కోట్ల విలువైన ఆస్తిని రాసిచ్చాడు. ఆ తర్వాత తను ఇల్లు కట్టుకోవాలని భావిస్తున్నానని, తిరిగి తన ఆస్తిని తనకు ఇచ్చేయాలని ఆయన హరికృష్ణను కోరారు. అయితే హరికృష్ణ ఆస్తిని తిరిగి బావకు ఇవ్వడానికి నిరాకరించాడు.

nellore srihari murder case shocking twist brother in law committed suicide along with wife and two children

కుక్కలకు ఇచ్చే ఇంజక్షన్ లను బావకు ఇచ్చిన బావమరిది

ఇద్దరు మధ్య గత కొంతకాలంగా ఈ ఆస్తి వ్యవహారంలో గొడవ జరుగుతుంది. ఈ క్రమంలో భావన అడ్డు తప్పించుకుంటే ఆస్తికి సంబంధించి ఎలాంటి గొడవ ఉండదని భావించి, జూన్ 15వ తేదీన దైవ దర్శనం కోసం వెళదామని చెప్పి బాగా శ్రీహరిని కారులో పెంచలకోనకు తీసుకువెళ్లాడు. తిరిగి వస్తుండగా చిన్న ప్లాన్ ప్రకారం రవీంద్ర, యానాదయ్యల సహాయంతో శ్రీహరికి బలవంతంగా కుక్కలకు వాడే ఇంజక్షన్లను ఇచ్చాడు.

హత్యకు సహకరించిన వారు అరెస్ట్

రెండు ఇంజక్షన్లు ఇచ్చేసరికి శ్రీహరి గుండె ఆగిపోయింది. దీంతో గుండెపోటుతో శ్రీహరి మృతి చెందాడని నమ్మించి దహనసంస్కారాలు పూర్తిచేశారు. అయితే శ్రీహరి భార్యకు అనుమానం రాగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ కేసులో సరిగ్గా దర్యాప్తు చేయలేదని భావించిన ప్రభుత్వం పోలీస్ స్టేషన్ లోని 23మంది సిబ్బందిని బదిలీ చేసింది. ఆపై దర్యాప్తులో భాగంగా బావను చంపింది బావమరిదని నిర్ధారించి, హత్యకు సహకరించిన ఇద్దరిని అరెస్టు చేశారు.

గూడ్స్ రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్న హరికృష్ణ కుటుంబం

హరికృష్ణ మాత్రం పోలీసులను తప్పించుకుని తిరుగుతున్న క్రమంలో అతనిని పట్టుకోవడానికి పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ సమయంలో హరికృష్ణ తన భార్య మరియు ఇద్దరు పిల్లలతో కలిసి సింగరాయకొండ రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. రైల్వే పోలీసులు ఆధార్ కార్డు ఆధారంగా మృతులను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం పోలీసులు దీనిపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+