కేసీఆర్, వైఎస్ జగన్ ను కలవని చిరంజీవి.. కీలక నిర్ణయం!
భోళాశంకర్ సినిమాతో మరోసారి రచ్చ రచ్చ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తాను కథానాయకుడిగా నటించిన భోళా శంకర్ ను ఈనెల 11వ తేదీన విడుదల చేయబోతున్నారు. తమన్నా కథానాయిక. కీర్తిసురేష్ చెల్లెలి పాత్రలో నటించింది. సుశాంత్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో సినిమా బుకింగ్స్ ప్రారంభించారు. ముందునుంచి అనుకుంటున్నట్లుగానే ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచడంలేదు. ప్రస్తుతం ఇప్పుడున్న రేట్లకే భోళాశంకర్ ను విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఇటీవలి కాలంలో అగ్రహీరోల సినిమాలు విడుదలైనప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి టికెట్ రేట్లను ప్రత్యేకంగా రెండువారాలపాటు పెంచుకుంటున్నారు. దీనివల్ల అభిమానాన్ని క్యాష్ చేసుకుంటున్నారంటూ విమర్శలు వచ్చినప్పటికీ హీరోలు మాత్రం తగ్గడంలేదు. వారి అభిమానం వారిది.

ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ వర్క్ ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రం శిల్పకళా వేదికలో ప్రి రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగబోతోంది. ఈ సినిమా ట్రైలర్ అదిరిపోవడంతో ఒక్కసారిగా అంచనాలు భారీగా పెరిగాయి. వాస్తవానికి మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి ఈ సినిమా చేస్తున్నారు అనగానే అభిమానుల నుంచే నిరసన వ్యక్తమైంది. అయితే అన్ని అంశాలను జాగ్రత్తగా పర్యవేక్షించుకుంటూ సినిమా బాగా రావడానికి చిరంజీవి కూడా దోహదపడ్డారని చెప్పవచ్చు. సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ జజారీచేసింది. రెండుగంటల 39 నిముషాలపాటలు రన్ టైమ్ ఉండనుంది.
ఈ సినిమా తర్వాత చిరంజీవి ఎవరి దర్శకత్వంలో నటించబోతున్నారనే విషయంలో స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి కథలు వింటున్నారు. యువ దర్శకులను ప్రోత్సహిస్తున్న చిరంజీవి.. ఈ మార్గంలోనే మరో యువ దర్శకుడికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కథాచర్చలు ముగిస్తేకానీ ఆ దర్శకుడు ఎవరనే విషయం బయటకు రాదు. అప్పటివరకు ఎదురు చూడాల్సిందే.












Click it and Unblock the Notifications