బాలకృష్ణకు చిరంజీవి కౌంటర్..ఇన్నాళ్లుకు జగన్‌తో భేటీ గుట్టు విప్పిన మెగాస్టార్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. గతంలో సీఎం వైఎస్ జగన్ హయాంలో సినీ పరిశ్రమ ఎదుర్కొన్న వేధింపులు, టికెట్ల ధరల పెంపు అంశంపై చర్చ జరిగింది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, చిరంజీవి నేతృత్వంలో హీరోలు జగన్‌ను కలిసినప్పుడు, జగన్ మొదట సమావేశానికి రాలేదని, చిరంజీవి గట్టిగా నిలదీయడంతోనే వచ్చారని వ్యాఖ్యానించారు.అయితే, ఈ మాటలను ఖండించిన బాలకృష్ణ, "ఎవరూ గట్టిగా నిలదీయలేదు. హీరోలు అందరూ వెళ్లిన సమయంలో ఆ సైకో (జగన్) సినిమాటోగ్రఫీ మంత్రిని కలవాలన్నారు.
ఈ వివాదంపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి, తాను ఇండియాలో లేనప్పటికీ, జరిగిన వాస్తవాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. బాలకృష్ణ తన పేరును ప్రస్తావించడంపై ఒకింత వ్యంగ్యంగా స్పందించారు. టికెట్ల ధరల పెంపుదల కోసం నిర్మాతలు, దర్శకులు (రాజమౌళి, కొరటాల శివ, మహేష్, ఎన్టీఆర్ వంటి ప్రముఖులు) తనను చొరవ తీసుకోవాలని కోరడంతో తాను అప్పటి మంత్రి పేర్ని నానితో మాట్లాడినట్లు చిరంజీవి తెలిపారు.

సీఎం జగనే స్వయంగా తనకు ఫోన్ చేసి లంచ్‌కు ఆహ్వానించారని, అక్కడే ఇండస్ట్రీ ఇబ్బందులు వివరించానని చెప్పారు. 'తాను ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతాను' అని పరోక్షంగా బాలయ్యకు కౌంటర్ ఇచ్చారు.సినీ పరిశ్రమ తరఫున కలిసేందుకు వెళ్లే ముందు తాను బాలకృష్ణను ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని, జెమిని కిరణ్‌ను పంపినా కలవలేకపోయారని చిరంజీవి వివరించారు.
చిరంజీవి చొరవ వల్లే ప్రభుత్వం టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించిందని, ఆ నిర్ణయం వల్లే 'వాల్తేరు వీరయ్య'తో పాటు 'వీరసింహారెడ్డి' వంటి బాలకృష్ణ సినిమాలకు కూడా లాభం చేకూరిందని చిరంజీవి గట్టిగా స్పష్టం చేశారు. ఈ వివరణతో అసెంబ్లీలో మొదలైన రాజకీయ రగడకు చిరంజీవి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications