చిరుకు తేడా తెలియదు, జగన్ పిచ్చిప్రేలాపనలు: కెటిఆర్

తెలంగాణ ప్రజలకు ఇష్టం ఉన్నా లేకున్నా కలిసి ఉండాల్సిందేనని జగన్ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. సిబిఐ కేసులను ఎత్తి వేయించుకునేందుకే వివిధ పార్టీల నాయకులను కలుస్తూ సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పలేని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తక్షణమే పార్టీని రద్దు చేసుకోవాలన్నారు.
హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణను ఏర్పాటు చేయాలని సిడబ్ల్యుసిలో తీర్మానం చేశారని, దానికే కట్టుబడి ఉండాలని, రాయల-తెలంగాణ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితిలోనూ ఆమోదించేది లేదని తెరాస పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రావణ్, ఐకాస చైర్మన్ కోదండరామ్ వేర్వేరుగా డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని ఎక్కువకాలం పాలించింది రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రులేనని, వారి నాయకత్వంలోనే తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు మళ్లీ సీమలోని రెండు జిల్లాలను కలిపి రాయల- తెలంగాణ ఏర్పాటు ప్రతిపాదన ఎందుకని శ్రవణ్ ప్రశ్నించారు.
రాయల తెలంగాణ అనేది బలవంతపు పెళ్లిగా అభివర్ణించారు. సీమ విభజనకు అక్కడి ప్రజలు అంగీకరించడం లేదు. సీమలోని రెండు జిల్లాలను కలుపుకునేందుకు తెలంగాణవాదులు ఇష్టపడటం లేదు. రెండు ప్రాంతాల నుంచీ అభ్యంతరాలు ఉన్నపుడు ఎవరి కోసం ఈ ప్రతిపాదన? అన్నారు. సిడబ్ల్యుసి 10 జిల్లాల తెలంగాణపై తీర్మానం చేసింది. అంతకన్నా ఎక్కువ, తక్కువలు వద్దు అన్నారు.
రాయల్-టి ప్రతిపాదనను టి.కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించాలని, కాంగ్రెస్ హైకమాండ్‌పై ఒత్తిడి తేవాలని సూచించారు. సహా వివిధ జెఎసిల ప్రతినిధులు ఆదివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ప్రకటిస్తూ గతంలో లేఖలు రాసిన 32 పార్టీల నేతలను కలిసి కృతజ్ఞతలు చెప్పేందుకు వెళ్తున్నట్టు చెప్పారు. అదే విధంగా పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్నందున తెలంగాణ బిల్లుకు మద్దతు కోరతామన్నారు. పది జిల్లాల తెలంగాణనే ప్రజలు కోరుతున్నారని, రాయల తెలంగాణను అంగీకరించేది లేదని కోదండరామ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications