టి తథ్యం: హైద్రాబాద్‌పై చిరు ఎమోషన్, అసద్‌కు కౌంటర్

న్యూఢిల్లీ: విభజన తథ్యమని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేసే విషయంపై తాము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి బుధవారం చెప్పారు. కేంద్రమంత్రి, మంత్రుల బృందం(జివోఎం) సభ్యులు జైరామ్ రమేష్‌తో సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు భేటీ అయ్యారు. జైరాంతో చిరంజీవి, పళ్లం రాజు, పురంధేశ్వరి, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, జెడి శీలం తదితరులు భేటీ అయ్యారు.

అనంతరం చిరంజీవి కాస్త ఎమోషనల్‌గా మాట్లాడారు. పోలవరం నిర్మాణం, హైదరాబాదు యుటి జరిగి తీరాల్సిందే అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తప్పనిసరి అని తేలిందన్నారు. ఈ పరిస్థితుల్లో సీమాంధ్ర ప్రజలకు న్యాయంగా చేయాల్సిన వాటి కోసం తాము కసరత్తు చేస్తున్నామని, సమన్యాయం జరగాలన్నారు. కేంద్రం, అధిష్టానం విభజన ప్రక్రియను వేగవంతం చేసిందన్నారు. 1956కు ముందు భద్రాచలం గోదావరి జిల్లాలో ఉందని, ఇప్పుడు తాము అలాగే కోరుకుంటున్నామన్నారు.

Chiranjeevi

మజ్లిస్ పైన ఆగ్రహం

హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేసే అంశంపై మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ రాజకీయ లబ్ధి కోసమే ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల సంక్షేమం దృష్ట్యా కాదన్నారు. తాను హైదరాబాదును యుటి చేయాలని, పోలవరం ప్రాజెక్టు రావాల్సిందేనని పట్టుబడుతున్నామన్నారు. వైద్య, ఉద్యోగం, ఆరోగ్యం విషయంలో తమకు న్యాయం జరగాలన్నారు. రాయల తెలంగాణ అని అసదుద్దీన్ డిమాండ్ చేయవచ్చు కానీ తాము యుటి కోసం డిమాండ్ చేయవద్దా అని ప్రశ్నించారు. ఉమ్మడికి తాము వ్యతిరేకమన్నారు.

విభజన తప్పనిసరి

రాష్ట్ర విభజన తప్పనిసరి అని తేలిందని, ఇప్పుడు కూడా కలిసి ఉండాలని పట్టుబట్టడం సరికాదని, అందులో అర్థం లేదన్నారు. సామరస్యంగా విడిపోదామని, సమన్యాయం కోసం కృషి చేద్దామన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి ఏ రకంగా న్యాయం చేయాలో దానిపై తాము కసరత్తు చేస్తున్నామన్నరు. సమైక్యం కోరుకునే వారిలో తాను మొదటి వాడినని కానీ, విభజన అనివార్యమని తేలిందన్నారు. శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వచ్చే అవకాశముందన్నారు. అన్ని సమస్యలు తీర్చాకే విభజన ఉంటుందన్నారు. రేపు సోనియాను కలుస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+