సచిన్, చిరంజీవి, నాగార్జునలు కలిశారు: ప్రత్యేక భేటీ వెనుక..
చిత్తూరు: పలువురు ప్రముఖులు బుధవారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తన 150వ చిత్రం కోసం బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, హీరో నాగార్జున, మాజీ క్రికెటర్ సచిన్‌లు ఈ ఉదయం తిరుమలలో కలిశారు.
స్వామివారి దర్శనానికి వచ్చిన వీరు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనానికి ముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లారు. గత రాత్రి వీరు తిరుమలకు వచ్చారు. అధికారులు స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు. ఉదయం దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందించారు.
వీరితో పాటు నిర్మాత అల్లు అరవింద్, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో మీడియా కోరిక మేరకు సెలబ్రిటీలంతా కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అంతకుముందు పద్మావతి గెస్ట్ హౌస్ వద్ద కూడా అందరూ కలిసి సందడి చేశారు.

సచిన్, నాగ్, చిరు ఎందుకు కలిశారంటే...
సచిన్ టెండుల్కర్, నాగార్జున, చిరంజీవి బుధవారం ఉదయం కలుసుకున్నారు. వారి కలయిక వెనుక ఓ కారణం ఉంది. కేరళలో ఫుట్ బాల్ అకాడమీని నెలకొల్పాలని వీరు ముగ్గురు భావిస్తున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అపాయింటుమెంట్ తీసుకున్నారు.
స్వామి వారి దర్శనం అనంతరం చెన్నై మీదుగా తిరువనంతపురం చేరుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌తో భేటీ అయ్యారు. వారు నెలకొల్పే అకాడమీకి పూర్తిస్థాయిలో సహకరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలుస్తోంది.
The #yellowmeinkhelo selfie with new co-owners. A warm welcome to the football crazy world of @KBFCOfficial pic.twitter.com/jak1H39LED
— sachin tendulkar (@sachin_rt) June 1, 2016












Click it and Unblock the Notifications