వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌న‌సేన కాదు..కాంగ్రెస్ కాదు : మెగాస్టార్ కొత్త నిర్ణ‌యం : ఎన్నిక‌ల వేళ చిరంజీవి కొత్త ట్విస్ట్‌..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Election 2019 : జ‌న‌సేన కాదు..కాంగ్రెస్ కాదు : మెగాస్టార్ కొత్త ట్విస్ట్‌..!

మెగా బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రు బ‌రిలో ఉన్నారు. ప‌వ‌ర్ స్టార్ జ‌న‌సేన సార‌ధ్యం వ‌హిస్తున్నారు. పైగా రెండు అసెంబ్లీ స్థానాల నుండి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగారు. ఈ ఇద్ద‌రి కోసం మెగా ఫ్యామిలీ నుండి ఎవ‌రు ప్ర‌చారానికి వ‌స్తార‌నే చ‌ర్చ సాగుతోంది. అయితే, ఇదే స‌మ‌యంలో మెగా కుటుంబం లో అన్న‌య్య చిరంజీవి జ‌న‌సేన కు మ‌ద్ద‌తు ఇస్తారా.. త‌మ్ముళ్ల‌ను గెలిపించ‌మ‌ని కో రుతారా..తేక‌, తాను ఉన్న కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తారా..ఇంత‌లో..చిరంజీవి ట్విస్ట్ ఇచ్చారు..

త‌మ్ముళ్ల‌కు అండ‌గా అన్న‌య్య నిల‌వ‌రా..

త‌మ్ముళ్ల‌కు అండ‌గా అన్న‌య్య నిల‌వ‌రా..

చిరంజీవి ఎంత గానో ఇష్ట‌పడే త‌న ఇద్ద‌రు త‌మ్ముళ్లు జ‌న‌సేన పార్టీ నుండి ఎంపీగా..ఎమ్మెల్యేగా బ‌రిలో ఉన్నారు. గ‌తం లో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన స‌మ‌యంలో ఆ పార్టీ గెలుపు కోసం నాగ‌బాబు..ప‌వ‌న్ క‌ళ్యాన్ ప్ర‌చారం చేసారు. ఆ ఎన్నిక‌ల్లో ఆ ఇద్ద‌రూ మాత్రం పోటీ చేయ‌లేదు. చిరంజీవి రెండు స్థానాల్లో పోటీ చేసి ఒక చోట ఓడారు..ఒక చోట గెలిచా రు. ఆ త‌రువాత ప్ర‌జారాజ్యం కాంగ్రెస్ లో విలీనం చేయ‌టంతో ఆయ‌న కాంగ్రెస్ లో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా..కేంద్రం మం త్రిగా ప‌ని చేసారు. అప్ప‌టి నుండి కాంగ్రెస్ లో కొన‌సాగారు. ఇక రాజ్య‌స‌భ అభ్య‌ర్దిగా కాల‌ప‌రిమితి ముగియ‌టం తో ఆయ న కాంగ్రెస్ పార్టీని వీడ‌క పోయినా..పార్టీలో మాత్రం యాక్టివ్ గా లేరు. పిసిపి అధ్య‌క్ష ప‌ద‌వి ఇస్తామ‌ని రాహుల్ ప్ర‌తిపా దించినా.. చిరంజీవి తిర‌స్క‌రించారు.

ఎన్నిక‌ల‌కు దూరంగా..

ఎన్నిక‌ల‌కు దూరంగా..

చిరంజీవి కాంగ్రెస్ లో ఉంటున్నా..రాజ‌కీయాల‌కు దాదాపు దూర‌మ‌య్యార‌ని చెప్పుకోవాలి. ఈ ఎన్నిక‌ల్లో చిరంజీవిని లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో దింపాల‌ని కాంగ్రెస్ పార్టీ భావించినా..ఆయ‌న అంగీక‌రించ‌లేదు. ఇదే స‌మ‌యంలో త‌మ్ము డు ప‌వ‌న్ క‌ళ్యాన్ జ‌న‌సేన ద్వారా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగారు. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ఏ నాడు చిరంజీవి వ్యాఖ్య‌లు చేయ లేదు. నాగ‌బాబు సైతం కొంత కాలం మౌనంగా ఉన్నా..ఇప్పుడు జ‌న‌సేన లో చేరారు. న‌ర్సాపురం లోక్‌స‌భ నుండి ఎంపి అభ్య‌ర్దిగా పోటీలో ఉన్నారు. నాడు త‌న కోసం ప‌ని చేసిన ఇద్ద‌రు త‌మ్ముళ్ల కోసం..నేడు చిరంజీవి జ‌న‌సేన‌కు మ‌ద్దతుగా ప్ర‌చారం చేస్తార‌ని భావించారు. మెగా ఫ్యామిలీ హీరోలు సైతం ప్రచారం లో దిగుతార‌ని మెగా అభిమానులు ఆశించారు. అయితే, ప్ర‌చారం చివ‌ర్లో రాం చ‌ర‌ణ్, అల్లు అర్జున్ జ‌న‌సేన కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తార‌ని చెబుతున్నారు.

చిరంజీవి ఇలా డిసైడ్ అయ్యారు..

చిరంజీవి ఇలా డిసైడ్ అయ్యారు..

ఇక వైపు కాంగ్రెస్ నేత‌లు ఎలాగైనా చిరంజీవిని ఒప్పించి పార్టీ ప్ర‌చారానికైనా తీసుకురావాల‌ని చాలా ప్ర‌య‌త్నాలు చే సారు. అవి ఫ‌లించ లేదు. ఇక‌, ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన కు మ‌ద్ద‌తుగా చిరంజీవి ప్ర‌చారంలోకి దిగుతార‌ని.. పార్టీ అభ్య‌ర్దుల గెలుపు కోసం ప‌ని చేస్తార‌ని అంద‌రూ ఆశించారు. అయితే, సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న చిరంజీవి తాను ఉన్న కాంగ్రెస్‌..లేద త‌న సోద‌రులు పోటీ చేస్తున్న జ‌న‌సేన కు ఒక‌టే దూరం పాటించాల‌ని నిర్ణ‌యించారు. ఏప్రిల్ 9వ తేదీతో ప్ర‌చారం ముగుస్తుంది.ఈ స‌మ‌యంలో రెండు పార్టీల నుండి ఒత్తిడి వ‌చ్చే అవ‌కాశం ప‌రోక్షంగా ఉండే అవ‌కాశం ఉండ‌టంతో..చిరంజీతి తాజా నిర్ణ‌యం తీసుకున్నారు. ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కూ రాజ‌కీయాల‌కు దూరంగా కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు. చిరంజీవి ఒక‌టి రెండు రోజుల్లో ప‌ది హేను రోజుల విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌టం దాదాపు ఖాయ‌మైంది. ఇప్పుడు ఇది మెగా అభిమానుల్లో చ‌ర్చ‌కు కార‌ణం అయింది.

English summary
Ex Central Minister Chiranjeevi decided to not support Janasena or congress. His brothers contesting from Janasena as Mp and Mla candidates. Chiranjeevi Planning to foreign trip up to completion of elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X