సింహపురిని రాజధాని చేస్తా: చిరంజీవి మెగా హామీ

అనంతరం బహిరంగ సభలో చిరంజీవి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు అందించినన్ని సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అందించలేదన్నారు. మరోసారి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు.
రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని, మళ్లీ ఆనం రామనారాయణ రెడ్డిని శాసనసభ్యునిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు.
విభజన నేపధ్యంలో సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి అభివృద్ధి చేస్తామని, ప్రత్యేక ప్యాకేజీ అంటే అభివృద్ధికి ఎంత అవసరమైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications