శ్రీజ కోసం చిరంజీవి ఏం చేశారో తెలుసా?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రారాజుగా వెలుగొందుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. సినీ పరిశ్రమలో ఆయనకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు. 60 సంవత్సరాల వయసులోను ఉత్సాహంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఎంత పెద్ద కథనాయకుడికైనా తన కుటుంబం అంటే చాలు ఎంతో ఇష్టం వేస్తుంది. సరిగ్గా చిరంజీవి కూడా తనకు ఎప్పుడు సమయం దొరికితే దాన్ని కుటుంబం కోసం కేటాయిస్తారు.
కుమార్తెలు, మనవరాళ్లతో సందడి చేస్తుంటారు చిరంజీవి. ముఖ్యంగా తన చిన్న కుమార్తె శ్రీజ అంటే చిరంజీవికి ఎనలేని ప్రేమ. ఆమె ఏదడిగినా కాదనరు. బాగా గారాబం చేస్తారు. తాజాగా శ్రీజ కు చిరంజీవి ఖరీదైన బహుమతి ఇచ్చినట్లు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఒక విలాసవంతమైన ఇంటిని చిరంజీవి కొనుగోలు చేశారు. అన్నిరకాలుగా అన్ని సౌకర్యాలున్న ఆ ఇంటి విలువ రూ.35 కోట్లని తెలుస్తోంది. తన సినిమాల నుంచి వచ్చిన రెమ్యునరేషన్ సొమ్ముతో కొనుగోలు చేశారు.

ప్రస్తుతం చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తున్నారు. తర్వాత భోళాశంకర్ సినిమా తెరకెక్కబోతోంది. జనవరి 13వ తేదీన వాల్తేరు వీరయ్య విడుదల కాబోతోంది. మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి యూనియన్ నాయకుడిగా కనిపించబోతున్నారు. చిరంజీవికి జోడీగా శ్రుతిహాసన్ నటించింది. మైత్రీ మూవీస్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భోళాశంకర్ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే అభిమానులు మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమా వద్దంటూ అభిమానులు గొడవ చేశారు.












Click it and Unblock the Notifications